Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై జేసీ కామెంట్స్.. స్పందించిన విజయసాయి

జేసీ దివాకర్ రెడ్డి జీవిత చరమాంకానికి చేరుకున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న జేసీ.. జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై ఈ రోజు ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి స్పందించారు.

vijayasai reddy responce over jc comments on jagan
Author
Hyderabad, First Published Dec 27, 2018, 2:29 PM IST


 జేసీ దివాకర్ రెడ్డి జీవిత చరమాంకానికి చేరుకున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న జేసీ.. జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై ఈ రోజు ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి స్పందించారు.

‘‘చంద్రబాబూ! రాజకీయ చరమాంకంలోవున్న జేసీ దివాకర్  జాతీయస్థాయి దళారీ అయిన మీ ప్రసన్నం కోసం, ప్రజలని కాకుండా మిమ్మల్ని చూస్తూ జగన్ గారిని, రెడ్డి సామాజిక వర్గాన్ని తిడుతుంటే మీ ముఖంలో ఈరోజు కనిపించిన ఆనందం ఏ సభ్యత సంస్కారాలకు నిదర్శనమో చెప్పగలరా? ఇలాంటి సభ పెట్టటానికి మీకు సిగ్గుందా?’’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో.. ‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికి వదిలేస్తే ఈపాటికి పూర్తయ్యేది. రాష్ట్రమే చేపడుతుందని చెప్పి వ్యయాన్ని అడ్డగోలుగా రూ.58 వేల కోట్లకు పెంచారు.   ఖర్చుకు లెక్క చూపకుండా, UC లు పంపకుండా రాష్ట్ర వరప్రదాయినిని కుంభకోణాల పుట్టగా మార్చారు నాయుడుబాబు.’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్ లో బిజెపి వ్యతిరేక ఫ్రంట్ పేరుతో వెళ్లి మీరు వీణలు బహుకరించిన వారంతా కేసీఆర్ ను స్వాగతించి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను అభినందిస్తున్నారని చంద్రబాబుని ఎద్దేవా చేశారు.  అఖిలేశ్ యాదవ్ తానే వచ్చి కేసీఆర్ ను కలుస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. మీ యాత్రలన్నీ ఫెయిలైనట్టున్నాయి చంద్రంసారూ.. గెలిచిన వారికే గొడుగులు పడతారు అంటూ ఎద్దేవా చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios