అనంతపురం: జగన్‌కు సీఎం అయ్యే యోగం లేదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. జగన్‌‌కు ముందు చూపుంటే ఇప్పటికే సీఎం అయ్యే వాడని ఆయన అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు అనంతపురంలో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నాం చేసే కుట్రను మోడీ చేస్తే  ఆ కుట్రను చేధించడంలో చంద్రబాబునాయుడు సక్సెస్  అయ్యారని ఆయన చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన స్నేహితుడు ఆయన కొడుకు వైఎస్ జగన్‌కు తిక్క ఎక్కువని  ఆయన చెప్పారు. కులం పేరుతో జగన్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని  చూస్తున్నాడని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు.  ఒక్క కులం మద్దతు కారణంగానే  మీరు ముఖ్యమంత్రి అయ్యారా అని చంద్రబాబునాయుడును ప్రశ్నించారు.

జగన్‌కు బుద్ది లేదు పాడు లేదన్నారు. జగన్‌కు కాళ్ల చూపు తప్ప ముందు చూపు లేదన్నారు. ఒకవేళ ముందు చూపుతో జగన్ వ్యవహరిస్తే ఎప్పుడో సీఎం అయ్యేవారని జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.సీఎం అయ్యే యోగం లేదని  జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. 

హిందూపురం లో నవీన్ నిశ్చల్‌ను టిక్కెట్టు కోసం రూ. 10 కోట్లను  జగన్ అడిగారని చెప్పారు. మీ భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని జేసీ కోరారు.

అన్ని కులాల మద్దతుతోనే  బాబు  ముఖ్యమంత్రి అయ్యారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో  రెడ్డి సామాజిక వర్గం కేవలం ఆరు నుండి ఏడు శాతం మాత్రమేనని చెప్పారు. చంద్రబాబునాయుడు సామాజికవర్గం తమ కంటే  తక్కువగా ఉంటుందని చెప్పారు.

వైసీపీ చీఫ్ జగన్‌కు కాస్త తిక్క ఎక్కువని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు.మోడీ ఎల్లకాలం ప్రధానిగా ఉండాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఈ కుట్రను భగ్నం చేయడంలో చంద్రబాబునాయుడు సక్సెస్ అయ్యారని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును గేట్లను  రికార్డు స్థాయిలో  బిగించారని చంద్రబాబునాయుడును  జేసీ దివాకర్ రెడ్డి అభినందించారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు భార్యాపిల్లలను కూడ మర్చిపోయి రాత్రి, పగలు అనే తేడా లేకుండా చంద్రబాబునాయుడు కష్టపడుతున్నారని ఆయన చెప్పారు.

బీజేపీకి వ్యతిరేకంగా దేశం యావత్తూ ప్రయాణం చేస్తోందన్నారు. ఒకవేళ మోడీ వచ్చి మిమ్మల్ని బతిలాడినా కూడ బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదని జేసీ దివాకర్ రెడ్డి  చంద్రబాబునాయుడును కోరారు.