మమ్మల్ని నిలువునా ముంచేశావు కదా తల్లి..సోనియాతో జేసీ

jc diwakar reddy meets sonia gandhi in parliament
Highlights

 పార్లమెంట్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. టీడీపీ ఎంపీ జేసీకి ఎదురుపడ్డారు. దీంతో.. తన ఆవేదననంతా జేసీ.. సోనియా ముందు ఉంచారు.
 

సోనియాగాంధీని నమ్ముకొని తాము నిలువునా మునిగిపోయామని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని జేసీ నిర్భయంగా సోనియాగంధీతో చెప్పడం విశేషం.

అసలు మ్యాటరేంటంటే.. ఈరోజు పార్లమెంట్ లో కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. పార్లమెంట్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. టీడీపీ ఎంపీ జేసీకి ఎదురుపడ్డారు. దీంతో.. తన ఆవేదననంతా జేసీ.. సోనియా ముందు ఉంచారు.

‘‘తల్లీ రాష్ట్రాన్ని విభజించావ్.. రెడ్లకు తీరని అన్యాయం చేశావ్.. కాంగ్రెస్‌ను నమ్ముకొని తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు’’ అంటూ సోనియాకు జేసీ దండం పెట్టారు. జేసీ వ్యాఖ్యలు విన్న సోనియా నవ్వుతూ ముందుకెళ్లారు. జేసీ గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌లో మనుగడ కష్టమని భావించి.. 2014ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.

loader