తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి గుత్తిలో హంగామా సృష్టించారు.

అనంతపురం : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి గుత్తిలో హంగామా సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి ఆయన గుత్తిలో పర్యటించారు. 

గుత్తి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తులసమ్మ తనయుడు ఆయన శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. "నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్‌ కమిషనర్‌ ఉండరు" అని దురుసుగా మాట్లాడారు. 

అయితే మధుసూదన గుప్తాతో కలిసి జేసీ పర్యటించడంపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ సభ్యత్వం లేని గుప్తాను తనకు పోటీగా తెచ్చేందుకే జేసీ ఇలా చేస్తున్నారనే అనుమానాలను ఆయన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.