Asianet News TeluguAsianet News Telugu

నేనూ ఓ మిడిల్ క్లాస్ అబ్బాయినే, అయినా మౌనంగా ఉండలేను : పవన్ కళ్యాణ్

 ఉత్తరాంధ్ర నుంచే బూత్ స్థాయి శిక్షణ కార్యక్రమాలు...

jansena chief pawan kalyan tweets

మధ్యతరగతి ప్రజలు రాజకీయాలంటే అసహ్యంగా భావించి అందులోకి రాకుండా దూరమవుతున్నారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అలా పారిపోవడం పిరికి చర్యగా ఆయన అభివర్ణించారు. విద్యావంతులైన మద్యతరగతి యువత కూడా రాజకీయాలపై ఆశలు కోల్పోయి నిరాశావాదంతో బ్రతుకుతున్నారిని అన్నారు. అయితే తాను కూడా ఓ మిడిల్ క్లాస్ వ్యక్తినే అని  పవన్ చెప్పారు. అయినా కూడా తాను ఓ మౌన ప్రేక్షకుడిగా ఉండకుండా బలహీన వర్గాలను అణచివేతకు గురి చేస్తున్న వారితో పోరాడుతున్నానని పవన్ గుర్తు చేశారు.  
 
ఇలా పోరాడకుంటే మనల్ని వెన్నెముక లేని వారిగా జమకడతారని తెలిపారు. అందువల్లే ఈ పోరాట స్పూర్తిని మద్యతరగతి ప్రజలు వీడవద్దని సూచించారు. నిమ్న మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి ప్రజలు రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకునేలా ఎదగాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. రాజకీయ పార్టీలను వీడకుండా ఉంటూ నైతిక విలువ కోల్పోకుండా ప్రశ్నించాలని అన్నారు.

 

1977 లో ఎమర్జెన్సీ  సమయంలో చాలా మంది  మధ్య తరగతి మేధావులు ఈ కుటిల రాజీయాలకు వ్యతిరేకంగా పోరాడారని ఆయన గుర్తు చేశారు. అందువల్లే తాను ఈ మధ్యతరగతి ప్రజలు రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నట్లు అది మన దేశానికి ఎంతగానో అవసరముందని పవన్ తెలిపారు.
 
పోరాటం చేసేవారికి తెగువతోపాటు సమర్థత, విషయ పరిజ్ఞానం తెలిసి ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ నాతో ఎప్పటికీ ఉండేది మీరేనని జనసైనికులను ఉద్దేశించి పవన్ ట్వీట్ చేశారు.  

ఇక మరో ట్వీట్ లో జనసేన పార్టీ తరపున బూత్ స్థాయిలోని జన సైనికులకు రాజకీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పవన్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బొమ్మదేవర శ్రీధర్ పర్యవేక్షిస్తారని తెలిపారు.   జూన్ చివరి నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని, రోజూ 6 గంటల పాటు శిక్షణ ఉంటుందని, ఇందులో పాల్గొని పరిపూర్ణులు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. నాయకులు ఎందరో రాజకీయాల్లోకి వస్తుంటారు, పోతుంటారు కానీ ఈ జనసైనికులు ఎప్పుడూ నాతోనే ఉంటారని పవన్ తెలిపారు.

  
 

Follow Us:
Download App:
  • android
  • ios