Asianet News TeluguAsianet News Telugu

పోటీలోనే కాదు.. ప్రచారంలోనూ పొత్తే.. జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రచార వీడియో వైరల్.. 

ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయని తెలిసిందే. ఇదివరకే పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపకాలపై భేటీ అయి చర్చలు జరిపారు. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉమ్మడిగా చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాను ఇలా వాడేస్తున్నాయి. 

Janasena TDP first joint campaign video KRJ
Author
First Published Jan 25, 2024, 12:18 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు జోరు పెంచుతున్నాయి. ఓటరు మహాశయులను తమ వైపు తిప్పుకోవడానికి  ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ ఎన్నికలకు రంగం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధిష్ఠానం ప్రచారంపై ఫోకస్ పెట్టింది.

మరోవైపు.. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయని తెలిసిందే. ఇదివరకే పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపకాలపై భేటీ అయ్యారు.  ఈ తరుణంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉమ్మడిగా చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాను  వాడుకోవాలని నిర్ణయించుకున్నాయి.  ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీడీపీ, జనసేన సోషల్ మీడియాను ప్రధాన వేదికగా మార్చుకున్నాయి.తాజాగా జనసేన-టీడీపీ మొదటి ఉమ్మడి ప్రచారం అంటూ జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. #helloap_byebyeycp అంటూ ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. 

ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ఉమ్మడి ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. పొత్తులో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 112 స్థానాల్లో బరిలోకి దిగనుండగా,  జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయని ఓ ప్రకటన వెలువడింది. అయితే.. ఆ ప్రకటనలో ఎలాంటి నిజం లేదంటూ.. అది ఫేక్ న్యూస్ అంటూ టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios