వారి కుటుంబానికి రూ.3లక్షల నగదు అందజేసిన పవన్

janasena president pawan visits payakaraopeta
Highlights

బాధిత కుటుంబాలను పరామర్శించిన పవన్

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పర్యటించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్.. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. పాయకరావుపేటకు పవన్ రానున్నాడని తెలిసి... ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు  ఇద్దరు అభిమానులు పవన్ ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కరెంట్ షాక్ కొట్టి ఇధ్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు..

కాగా.. తన కోసం ఫ్లెక్సీ కడుతూ మృతి చెందిన శివ, నాగరాజు కుటుంబాలను ఈ రోజు పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా చనిపోయిన శివ మూడేళ్ల కొడుకుకి పవన్.. అనిరుధ్ అని నామకరణం చేశారు. తాత్కాలిక సాయంగా వారి కుటుంబాలకు రూ.3లక్షల నగదు అందజేశారు. అంతేకాకుండా శివ భార్యకు ఉద్యోగం కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. 

loader