జల్లికట్టు అంటే  ఏందుకంటే...

జల్లికట్టుకి ,హోదాకి లింకు ఏమిటి?

అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అర్థం కాని ప్రశ్న.

జల్లికట్టుకు ప్రత్యేక హోదా ముడివేసి, ఆంధ్రదేశమంతా చర్చ జరుగుతున్నపుడు, దావోస్ నుంచి వచ్చాక చీకాకుపడుతూ చంద్రబాబునాయుడు వేసిన ప్రశ్నఇది.

 ఈ ప్రశ్నకు ఈ రోజు పవన్ సమాధానం ఇచ్చారు ట్విట్టర్ లో.

"ఒక సాంప్రదాయం కోసం తమిళులు అంత పోరాటం చేస్తున్నప్పడు,మన అవసరాలు కోసం ఇంకెంత పోరాటం చెయ్యాలి. ఆ జల్లికట్టు పోరాట స్ఫూర్తితో యువత ముందుకు వస్తున్నపుడు, కుదరితే యువతకు సహకరించండి. అంతేకాని, వెనక్కి లాగే వ్యాఖ్యలు చేయకండి, " అని పవన్ చెప్పారు.

“అమ్మా పెట్టదు,అడుక్కు తిననివ్వదు అన్న సామెత లాగా ఎపి స్పెషల్ స్టేటస్ కి మీరు పోరాటం చేయరు, చేసే వారిని చేయనివ్వరు, మరిఎలా?”

ఇదే సమయంలో ఆయన కేంద్రానికి కూడా రెండు మంచి ముక్కలు చెప్పారు. 

‘ఆంధ్రులు ..ఈ దేశ ప్రజలు.. కేంద్రం లొ వుండె నాయకులకి,పార్టిలకి బానిసలు కారు..

పదవులు కోరుకునే వారు,వ్యక్తిగత లాభం ఆశించే వారు, వ్యాపర అవసరాలు ఉన్న వ్యక్తులు, నాయకులు మీకు ‘జీ హుజూర్’ అ వంగి వంగి సలాములు చేయ్యడం చూసి ‘ ఆంధ్రులు మీ బానిసలు అని పొరబడవద్దు,’ అన్నారు. 

మంత్రి అయ్యన్నపాత్రుడి చురక

హోదా గురించి పవన్ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడితే బావుంటుందని మంత్రి అయ్యన్న పాత్రుడు నిన్న ఒక సలహ పడేశారు.

దీనికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చురకేస్తూ ట్వీట్‌ చేశారు.

‘పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు నన్ను మోదీ గారితో మాట్లాడితే బాగుంటుందన్నారు. నేను వారికి చెప్పేదేమిటంటే.. నేను మోదీ గారితో ప్రచార సభల్లోనే కూర్చున్నాను. కానీ మీ ఎంపీలు అందరూ పార్లమెంట్లో ఆయనతో పాటు కూర్చుంటున్నారు కదా.. మరి వారేంచేస్తున్నారు.. మీడియా ముందుకు వచ్చి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని చెప్పడం తప్పా. అసలు ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి. ప్రజలు అసంతృప్తిని కేంద్రానికి చెప్పడానికి కూడా మీరు భయపడితే ఎలా.. మీరు ఆ పని చేయలేదు కాబట్టే కదా.. ఈ రోజు యువత రోడ్ల మీదకు వస్తున్నారు. మీరు ఏమీ చేయకండి.. యువతను ఏమీ చేయనీకండి. మరి దీనికి పరిష్కారం ఏమిటి..? ’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.