అమరావతి: ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా మహిళా శక్తికి రాజకీయ సాధికారిత అందించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మహిళా కమిటీలను నియమించారు. 

కమిటీలలో సుమారు 22 మంది మహిళలకు పవన్ చోటు కల్పించారు. జనసేన పార్టీ తొలిసారిగా ఆడపడుచులతో కమిటీలు ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ వీరమహిళ విభాగానికి చైర్మన్ గా కర్నూలు జిల్లాకు చెందిన జవ్వాజి రేఖను నియమించారు. 

కాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన సింధూరి కవిత,గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన షేక్ జరీనా, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన నూతాటి ప్రియా సౌజన్య, హైదరాబాద్ కు చెందిన జి. శ్రీవాణిలను వైస్ చైర్మన్లుగా నియమించారు. వీర మహిళ విభాగంతోపాటు పలు విద్యార్థి విభాగాలను కూడా నియమించారు. వీర మహిళ చైర్మన్   నూతాటి లను నియమించారు. 

అలాగే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వీరమహిళా విభాగం కన్వీనర్లను కో కన్వీనర్లను, కో ఆర్డినేటర్లను నియమించారు. తిరుపతి పార్లమెంటరీ వీరమహిళ విభాగం కన్వీనర్ గా ఆకేపాటి వెంకట సుభాషిణి , ఏలూరు పార్లమెంటరీ కన్వీనర్ గా కోట మేరీ సుజాత, రాజమహేంద్రవరం పార్లమెంటరీ వీరమహిళ కో-కన్వీనర్లుగా సాయి రమణి, కళ్యాణి పాలేపు, యండం ఇందిర, సుంకర మాధవి, పాటంశెట్టి కాశీరాణిలను నియమించారు. 

నెల్లూరు పార్లమెంటరీ కన్వీనర్ గా ఇందిర పోలిరెడ్డి, కో కన్వీనర్ గా  నాగరత్నం గుండ్లూరు, రోజా రాణి, బాపట్ల పార్లమెంటరీ కో కన్వీనర్లు గా లక్ష్మి కళ గోపాలం, కొండవీటి హర్షిత, సికింద్రాబాద్ పార్లమెంటరీ కో కన్వీనర్ గా మండపాక కావ్య, ఏలూరు పార్లమెంటరీ కో ఆర్డినేటర్ గా రమాదేవి అర్జా, మచిలీపట్టణం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ గా మక్కి విజయకుమారిలను నియమించారు. 

ఒంగోలు పార్లమెంటరీ కో కన్వీనర్ గా కోసూరి శిరీష, నరసాపురం కో కన్వీనర్ గా శిరిగినీడి సాయి రవళి, రాజమండ్రి పార్లమెంటరీ కో ఆర్డినేటర్లుగా కందికట్ల అరుణకుమారి, తాకాసి దుర్గ, రాజంపేట పార్లమెంటరీ కో కన్వీనర్ గా నాగలక్ష్మి మొలక, కో ఆర్డినేటర్ గా షేక్ హలీమాబీ, నరసాపురం పార్లమెంటరీ కో కన్వీనర్ గా పుష్ప నళిని పోలిశెట్టిలను ప్రకటించారు. 

గుంటూరు పార్లమెంటరీ కన్వీనర్ గా రావి రమ, కో కన్వీనర్ గా భారతి చందు, విశాఖపట్నం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ గా సింగంశెట్టి దేవి, కడప పార్లమెంటరీ కన్వీనర్ గా జయప్రద రెడ్డి, కో కన్వీనర్ గా కలిశెట్టి విజయ, అనంతపురం పార్లమెంటరీ కో కన్వీనర్లుగా  టి.ఎస్.లలిత, రాజు లహరి, కాకినాడ పార్లమెంటరీ కో కన్వీనర్ గా వెంకట లక్షి పెంకేలను ఎంపిక చేశారు.

చిత్తూరు పార్లమెంటరీ కో కన్వీనర్ గా కె.పుష్పావతి, కో ఆర్డినేటర్ గా జి.పద్మావతి, హిందూపూర్ పార్లమెంటరీ కన్వీనర్ గా కానంపల్లి అనురాధ, విజయవాడ కో ఆర్డినేటర్లు గా దోసపాటి శశికళ, షేక్ షహీన, దాసరి భవానిలను నియమించారు.
 
వీరితోపాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన  సుజాత పాండాకు స్థానం కల్పించారు. అలాగే జనసేన పార్టీ పాలసీ వింగ్ చైర్మన్ గా డాక్టర్ యామిని జ్యోత్స్నా కంబాలను నియమించారు. మరోవైపు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా 15 మంది మహిళలకు స్థానం కల్పించారు పవన్ కళ్యాణ్.

పార్లమెంటరీ వర్కింగ్ కమిటీలోనూ ఐదుగురికి అవకాశం కల్పించారు. క్యాంపైనింగ్ అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్ గా బ్యాడ్మెంటన్ క్రీడాకారిణి ఉషశ్రీ పెద్దిశెట్టిని నియమించారు. అలాగే నలుగురు ఆర్గనైజింగ్ సెక్రటరీలను, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ముగ్గురిని నియమించారు.

పార్లమెంటరీ నియాజకవర్గాల వారీగా నియమిస్తున్న ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో మహిళలకు స్థానం కల్పిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఎగిజిక్యూటివ్ కమిటీల్లో సభ్యులుగా నియమితులైన వారి వివరాలు...
 
8 మందితో పార్టీ ఐడియాలజీ వింగ్ సభ్యులను ఏర్పాటు చేశారు. అలాగే నరసాపురంకి చెందిన రజితను సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా నియమించారు. ఎన్నికల సమయంలో అనుసరించే వ్యూహాలు, ప్రణాళికల రూపకల్పనలో మహిళలకి భాగస్వామ్యం కల్పించేలా ఎలక్షనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 

ఆ విభాగానికి వైస్ చైర్మన్ గా విజయనగరానికి చెందిన లోకం వర్షిణిని నియమించారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. వీరితోపాటు ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా తుమ్మి లక్ష్మీరాజ్ ని ఎంపిక చేశారు. 

ప్రజా పోరాటయాత్రలో భాగంగా వెళ్లిన ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ ఆస్పత్రులు సరిగ్గా లేకపోవడంతో పల్లెల్లో వైద్యం అందడం లేదని పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఈ నేపధ్యంలో జనసేన పార్టీలో పబ్లిక్ హెల్త్ బాడీని ఏర్పాటు చేశారు. పబ్లిక్ హెల్త్ బాడీ చైర్మన్ గా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన కొప్పుల నాగ మానసకు స్థానం కల్పించారు. 

జై కిసాన్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గా లక్ష్మి కుమారిని నియమించారు. జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ గా, పార్టీ ప్రతినిధిగా అనంతపురంకు చెందిన పసుపులేటి పద్మావతిని నియమించారు. అలాగే నలుగురు సభ్యులతో కూడిన ప్రొటొకాల్స్ కమిటీని కూడా నియమించారు. 

వీరితోపాటు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం అధికార ప్రతినిధిగా వాణిశ్రీ కావూరిని నియమించారు. పార్టీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఇద్దరికి స్థానం కల్పించారు. ఐదుగురు సభ్యులతో కూడిన సెంట్రల్ ఆఫీస్ గ్రీవెన్స్ కమిటీని కూడా నియమించారు. 

కమ్యూనిటీ అండ్ సోషల్ జస్టిస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇరంఖాన్ ను నియమించారు. లాజిస్టిక్స్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ కమిటీ వైస్ చైర్మన్ గా రాజమండ్రికి చెందిన గంటా స్వరూపదేవిని నియమించారు. కాన్స్టిట్యూషన్ అండ్ సివిల్ రైట్స్ విభాగం వైస్ చైర్మన్ గా చిత్తూరు జిల్లాకు చెందినగా కవితను ఎంపిక చేశారు. 

ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల పర్యవేక్షణ కమిటీ వైస్ చైర్మన్ గా జంగారెడ్డి గూడెంకు చెందిన దువ్వెల సృజనను ఎంపిక చేశారు. పబ్లిక్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన నందిగం రాణిని నియమించారు. సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ కమిటీలో చెరుకుపల్లి శ్రావణికి చోటు కల్పించారు.