Janasena: సీఎం జగన్‌ పంచ్‌లకు నాగబాబు కౌంటర్.. ‘గ్లాస్ సింక్‌లో ఉన్నా.. ’

సీఎం జగన్ పంచ్‌లకు నాగబాబు ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు. గ్లాస్ సింక్‌లో ఉన్నా తెల్లారే తేనేటి విందునిస్తుందని కామెంట్ చేశారు. కానీ, ఫ్యాన్ రెక్కలు విరిగితే మాత్రం పనికిరాదని పేర్కొన్నారు.
 

janasena party leader nagababu counter to cm jagan over his glass should be in sink remarks kms

Nagababu: ఏపీలో రాజకీయ ప్రసంగాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. సినిమా డైలాగ్‌లు, పంచ్‌లు, ప్రాసలతో కాక రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు కుర్చీ మడతపెట్టేస్తారని జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ కూడా షర్ట్ మడతేస్తారని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని సీఎం జగన్ అన్నారు. అలాగే.. తాగేసిన గ్లాస్ సింక్‌లోనే ఉండాలని టీడీపీ, జనసేనలకు చురకలు అంటించారు. 

ఈ వ్యాఖ్యలకు జనసేన నాయకుడు నాగబాబు సోమవారం రియాక్ట్ అయ్యారు. గ్లాస్ సింక్‌లో ఉన్నా.. తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుందని పేర్కొన్నారు. కానీ, ఫ్యాన్ రెక్కలు విరిగితే మాత్రం విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వలేదు అని సెటైర్లు వేశారు. అయినా.. పబ్లిక్ మీటింగ్‌లలో ప్రాసలు, పంచ్‌లపై పెట్టిన శ్రద్ధ సగం ప్రజా పాలనపై పెట్టాల్సిందని ఎక్స్ వేదికపై ట్వీట్ చేశారు.

Also Read: తమిళనాడులో కమల్ హాసన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నాడంటే?

ఈ ట్వీట్ పై అనేక రకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు జనసేనను ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు వైసీపీని ట్రోల్ చేశారు. కొందరు నాగబాబుకు మద్దతుగా కామెంట్లు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios