హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ఆయన సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కలిశారు. పవన్ కళ్యాణ్ తోపాటు  పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ సైతం మెగాస్టార్ ను కలిశారు.  

చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిలు కలుసుకోవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో షేర్ చేయడంతో మెగా అభిమానులు పండుగ చేసుేకుంటున్నారు.  

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే మెగాస్టార్ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా గడపడంతో ఆయన ఎన్నికల ప్రచారానికి రాలేకపోయిన సంగతి తెలిసిందే.