చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశంలో జనసేన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆదేశిస్తే వైసీపీ నేతల తలలు నరుకుతా అంటూ ఆవేశపూరితంగా ప్రవర్తించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ తమను ప్రతీ విషయంలో వెనక్కి లాగుతున్నారని లేకపోతే ఏం చేయాలో అదే చేసేవాళ్లమని చెప్పుకొచ్చాడు. 

చిత్తూరు జిల్లా మదనపల్లిలో అనంతపురం నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సమావేశంలో అనంతపురంకు చెందిన జనసైనికుడు సాకే పవన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఇప్పుడే రంగంలోకి దిగి వైసీపీ నేతల తలలు నరుకుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

మీరు ఏదైనా చెయ్యండి అని పవన్ కళ్యాణ్ మమ్మల్ని వదిలేస్తే వైసీపీ నేతల తలలు నరకడానికి కూడా వెనకడుగు వేయమంటూ చెప్పుకొచ్చాడు. ఏ జనసైనికుడు కూడా వైసీపీ పెట్టే కేసులకు భయపడే పరిస్థితి లేదన్నారు. 

జనసేన అధినాయకుడు జగనన్నకు నమస్తే: పవన్ సభలో మహిళ

అనంతపురం జిల్లాలో ప్రకాష్ రెడ్డే కాదు ఏ రెడ్డి అయినా సరే తలలు నరికేందుకు నేను రెడీ అంటూ ఆవేశంతో ఊగిపోయారు మురళి. నేను సిద్ధంగా ఉన్నాను మీరు రెడీనా అంటూ ఇతర  కార్యకర్తలను అడిగి మరీ తెలుసుకున్నారు సాకే పవన్ కుమార్. 

తాము భయపడేది తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలకు తప్ప ఇతరులకు మాత్రం భయపడమన్నారు. వైసీపీ పెట్టే కేసులకు కూడా తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు ఇతర నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

సభ వేదికపై నుంచి సాకే పవన్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా కనీసం వారించే ప్రయత్నం కూడా చెయ్యలేదు నేతలు. దాంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే సాకే పవన్ కుమార్ వ్యాఖ్యలపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

 వైసీపీ ఎమ్మెల్యేలను కట్టేసి దుక్కిదున్నిస్తాం: పవన్ కళ్యాణ్