చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ గురువారం మహిళా సంఘాల నేతలతో సమావేశమయ్యారు. 

పవన్ ఏర్పాటు చేసిన సమావేశానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే స్టేజ్ పై మహిళా సంఘాల నేతలతోపాటు పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. 

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సందర్భంగా ఒక మహిళ వేదికపైకి వచ్చి మాట్లాడటం మెుదలుపెట్టింది. వేదికపై ఉన్న పెద్దలకు, జనసేన నాయకులకు, మహిళలకు నమస్కారాలు అంటూ చెప్పుకొచ్చింది. 

వైసీపీ ఎమ్మెల్యేలను కట్టేసి దుక్కిదున్నిస్తాం: పవన్ కళ్యాణ్

అనంతరం ముఖ్యంగా జనసేన అధినాయకులు జగనన్నకు నమస్కారం, స్వాగతం అంటూ తడబడింది. దాంతో అంతా నవ్వేశారు. తాను వేదికపై మాట్లాడటం ఇదే తొలిసారి అని కంగారులో తడబడ్డానని చెప్పుకొచ్చారు. 

వెంటనే పవన్ కళ్యాణ్ సైతం ఆమెను కొన్ని సందర్భాల్లో ఇలాంటివి తప్పదన్నారు. ఇంతమంది మధ్యలో స్టేజ్ పై నిల్చుని మాట్లాడటంతో కొంతమందికి ఆందోళన కరంగా ఉంటుందని పర్లేదని పవన్ ఆమెతో చెప్పారు. సమస్యలు చెప్పాలని ఆదేశించడంతో ఆమె మహిళల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చింది.

నన్ను ఆపితే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా: జగన్ కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్