Asianet News TeluguAsianet News Telugu

ఆర్జీవీ ఒక వెధవ.. పవన్‌కు కోట్లలో రెమ్యునరేషన్, ప్యాకేజ్ ఎందుకు : వైసీపీ నేతలకు నాగబాబు కౌంటర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీ‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు జనసేన నేత నాగబాబు. వైసీపీ నేతల తాతలు వచ్చి పవన్ కల్యాణ్‌కు ప్యాకేజ్ ఇచ్చారా అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

janasena leader nagababu counter to ysrcp leaders
Author
First Published Jan 11, 2023, 5:40 PM IST

ఒక్క సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకునే పవన్‌కు ప్యాకేజ్ అవసరమా అని ప్రశ్నించారు జనసేన నేత నాగబాబు. తమకు ప్యాకేజ్ ఎవరిచ్చారంటూ ఘాటుగా విమర్శించారు. రామ్‌గోపాల్ వర్మ అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని , అతనోక వెధవ అంటూ నాగబాబు విమర్శించారు. కాపు కులాన్ని తాకట్టు పెట్టే హక్కు తమకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతల తాతలు వచ్చి పవన్ కల్యాణ్‌కు ప్యాకేజ్ ఇచ్చారా అని నాగబాబు నిలదీశారు.

యువతీ యువకులు తమ అభిప్రాయాన్ని ధైర్యంగా తెలియజేయగలిగేలా జనసేన పార్టీ క్రియేట్ చేయగలిగిందన్నారు. ఇప్పటి వరకు యువత ఆలోచనలు, అభిప్రాయాలు సోషల్ మీడియా వరకే పరిమితమయ్యాయని నాగబాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వాళ్లు గళం విప్పబోతున్నారని.. రాష్ట్ర అభివృద్ధికి వారిచ్చే సూచనలు రేపు తెలుస్తాయని ఆయన అన్నారు. అన్ని సమస్యలతో పాటు యువతకు దిశానిర్దేశం చేసే ఆలోచనలు పవన్ వద్ద వున్నాయని నాగబాబు పేర్కొన్నారు. 

ALso REad: RIP కాపులు.. కంగ్రాట్స్ కమ్మోళ్లు: ఆర్జీవీ సంచనల ట్వీట్.. మండిపడుతున్న పవన్ అభిమానులు

ఇదిలావుండగా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీ‌పై ట్విట్టర్‌ వేదికగా పరోక్షంగా స్పందించిన ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టార్గెట్‌గా విమర్శలు కురిపించారు. ‘‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు .. RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు’’ అంటూ రామ్‌ గోపాల్ ట్వీట్ చేశారు. అయితే తన ట్వీట్‌లో ఎవరి పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే పవన్ సామాజిక వర్గాన్ని ప్రస్తావించడంతో ఆయన అభిమానులు, కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వర్మపై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతూ..  ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఏపీ సర్కార్ జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ర్ 1, పెన్షన్ లబ్ధిదారుల కోత, పాడిరైతులకు గిట్టుబాటు ధర చెల్లించకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను అణిచివేయడం మొదలైన వాటితో సహా పలు సమస్యలపై వారు చర్చించినట్లు నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios