Asianet News TeluguAsianet News Telugu

RIP కాపులు.. కంగ్రాట్స్ కమ్మోళ్లు: ఆర్జీవీ సంచనల ట్వీట్.. మండిపడుతున్న పవన్ అభిమానులు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచనల ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీ‌పై ట్విట్టర్‌ వేదికగా పరోక్షంగా స్పందించిన ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Ram Gopal varma Indirectly Targeting Pawan Kalyan and chandrababu meeting
Author
First Published Jan 9, 2023, 10:28 AM IST

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచనల ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీ‌పై ట్విట్టర్‌ వేదికగా పరోక్షంగా స్పందించిన ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టార్గెట్‌గా విమర్శలు కురిపించారు. ‘‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు .. RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు’’ అంటూ రామ్‌ గోపాల్ ట్వీట్ చేశారు. అయితే తన ట్వీట్‌లో ఎవరి పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే పవన్ సామాజిక వర్గాన్ని ప్రస్తావించడంతో ఆయన అభిమానులు, కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వర్మపై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతూ..  ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఏపీ సర్కార్ జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ర్ 1, పెన్షన్ లబ్ధిదారుల కోత, పాడిరైతులకు గిట్టుబాటు ధర చెల్లించకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను అణిచివేయడం మొదలైన వాటితో సహా పలు సమస్యలపై వారు చర్చించినట్లు నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని ఆరోపించారు. 

 

అయితే ఎన్నికల పొత్తులపై తర్వాత చర్చిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని.. సమీకరణాలను బట్టి పొత్తులు ఉంటాయని చెప్పారు. 2009లో టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకుందని గుర్తుచేశారు. ఆ తర్వాత విభేదించామని చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఏ నిర్ణయాలు తీసుకునే దానిపై తమ వ్యుహాలు తమకు ఉంటాయని చెప్పారు. 

రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేయాలో వివరంగా చర్చించామని కళ్యాణ్ చెప్పారు. బాధ్యతాయుతమైన పాలనను తీసుకురావడం తమ ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. తన మిత్రపక్షమైన బీజేపీతో కూడా ఈ అంశాన్ని చర్చిస్తానని కల్యాణ్ చెప్పారు. ఇక, గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో పవన్ కల్యాన్ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు ఆయనను విజయవాడలోని హోటల్‌లో కలిసి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. 

అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ కూడా సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబును కలిసినట్టుగా చెప్పారు. చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు తీరు, వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై చర్చించేందుకు చంద్రబాబును కలిశానని తెలిపారు. అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల భేటీపై అధికార వైసీపీ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios