సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యక్రమాలకు స్వల్ప విరామం ప్రకటించారు. ఆయన కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు.. తన కుమారుడు శంకర పవనోవిచ్‌కు క్రైస్తవ మతాచారం ప్రకారం చేయాల్సిన కొన్ని లాంఛనాలను క్రిస్మస్ సందర్భంగా పూర్తి చేయాలని ఆయన సతీమణి అన్నా లెజె‌నోవా కోరారు.

భార్య కోరిక మేరకు ఆయన కుటుంబంతో కలిసి యూరప్ వెళ్లారు. క్రిస్మస్ తర్వాత ఆయన తిరిగి భారత్‌కు చేరుకుంటారు. యూరప్ పర్యటన తర్వాత పూర్తి సమయం ఏపీ రాజధాని అమరావతిలో పార్టీ శ్రేణులకు కేటాయిస్తారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.