నాతో పంతానికి దిగితే.. ఫ్రీగా సినిమాలు ఆడిస్తా : జగన్‌కు పవన్ కల్యాణ్ హెచ్చరిక

సినిమా టికెట్లు (movie tickets), థియేటర్ల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  తన సినిమాలను ఆపి ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. అలాంటి బెదిరింపులకు తాను భయపడనని ఆయన స్పష్టం చేశారు.

janasena chief pawan kalyan warns ap cm ys jagan over movie tickets

సినిమా టికెట్లు (movie tickets), థియేటర్ల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సినిమాలను ఆపి ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. అలాంటి బెదిరింపులకు తాను భయపడనని ఆయన స్పష్టం చేశారు. పంతానికి దిగితే నా సినిమాలను ఉచితంగా ఆడిస్తానంటూ పవన్ సంచలన ప్రకటన చేశారు. సినిమా టికెట్లకు పారదర్శకత లేదంటున్నారని.. ప్రభుత్వం అమ్మే మద్యానికి పారదర్శకత ఉందా అని ఆయన నిలదీశారు. 

కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను (vizag steel plant privatization) అడ్డుకోవాలని కోరుతూ జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నిరాహార దీక్ష ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ...స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే బూతులు తిడతారంటూ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 152 మంది ప్రాణాలు తీసుకున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలు చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామని.. ఈ ప్లాంట్ కేవలం పరిశ్రమే కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయడమేనని ఆయన అభివర్ణించారు. 

Also Read:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. చేతగాని వ్యక్తులు చట్టసభల్లో ఎందుకు : వైసీపీపై పవన్ వ్యాఖ్యలు

నేను వెళ్లి కేంద్రంతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు చెబుతున్నారని.. గతేడాది బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అమరావతే రాజధానిగా వుండాలని కండీషన్ పెట్టాలని పవన్ చెప్పారు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా అందుకు ఒప్పుకుందని ఆయన తెలిపారు. మొన్న తిరుపతి సభలో అమిత్ షా (amit shah) కూడా అమరావతే రాజధాని అని చెప్పారని పవన్ వెల్లడించారు. వైసీపీ ఇచ్చిన మాటకు కట్టుబడి లేదని.. వైసీపీ నేతలు మాకు శత్రువు కాదని, కానీ ఆ పార్టీ పాలసీలే మాకు శత్రువుని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని పవన్ దుయ్యబట్టారు. జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యేని మీరు లాక్కున్నారని.. ఒక్క ఎమ్మెల్యేని గెలిపించిన నాకే కేంద్రం గౌరవం ఇస్తుంటే మీరేం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. 

151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు వుండి మీరేం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరూ ఏకతాటిపైకి రావాలని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే దమ్ముందా అని పవన్ కల్యాణ్ సవాల్ చేశారు. తప్పు కేంద్రానిది కాదు.. అడిగే  పద్ధతి లేదని ఆయన అన్నారు. చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చోవడం దేనికంటూ ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios