Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు : త్వరలో ఢిల్లీకి పవన్ కళ్యాణ్, ఆ వెంటే చంద్రబాబు కూడా.. ఈసారి తాడోపేడో తేల్చాల్సిందే..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. సీట్ల పంపకం, ఉమ్మడి కార్యాచరణపై ఇరు పార్టీల అధినేతలు చర్చలు జరుపుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నాటికి సీట్ల షేరింగ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం వుంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. 

janasena chief pawan kalyan to went delhi over tdp janasena and bjp alliance ksp
Author
First Published Jan 26, 2024, 4:35 PM IST | Last Updated Jan 26, 2024, 4:37 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. సీట్ల పంపకం, ఉమ్మడి కార్యాచరణపై ఇరు పార్టీల అధినేతలు చర్చలు జరుపుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నాటికి సీట్ల షేరింగ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం వుంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. పొత్తుల విషయంగా బీజేపీతో ఆయన క్లారిటీ తీసుకున్నారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసొస్తుందా రాదా అన్నదానిని తేల్చేయాలని పవన్ భావిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం వుందన్న ఊహాగానాల మధ్య పొత్తులపై తాడో పేడో తేల్చేయాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీని ఎలాగైనా కూటమిలోకి లాగాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికలకు సమయం లేకపోవడంతో బీజేపీతో ఏదో ఒకటి తేల్చేస్తే సీట్ల పంపకాలకు ఎండ్ కార్డ్ వేయాలన్ని టీడీపీ అధినేత ఆలోచనగా తెలుస్తోంది. 

ఇదివరకే పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపకాలపై భేటీ అయ్యారు.  ఈ తరుణంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉమ్మడిగా చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాను  వాడుకోవాలని నిర్ణయించుకున్నాయి.  ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీడీపీ, జనసేన సోషల్ మీడియాను ప్రధాన వేదికగా మార్చుకున్నాయి.తాజాగా జనసేన-టీడీపీ మొదటి ఉమ్మడి ప్రచారం అంటూ జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. #helloap_byebyeycp అంటూ ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. 

ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ఉమ్మడి ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. పొత్తులో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 112 స్థానాల్లో బరిలోకి దిగనుండగా,  జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయని ఓ ప్రకటన వెలువడింది. అయితే.. ఆ ప్రకటనలో ఎలాంటి నిజం లేదంటూ.. అది ఫేక్ న్యూస్ అంటూ టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios