అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు రాజధాని పరిసర గ్రామాల్లో పర్యటిస్తారు. రైతుల ఆందోళనల్లో పాల్గొంటారు. జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సోమవారం నాడు సమావేశమయ్యారు. రాజధాని గ్రామాలకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకొన్నారు.

Also read:అమరావతి:జగన్‌ సర్కార్‌కు అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశం

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతులు 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న రైతులకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు.

రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నాడు తొలుత ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చోటు చేసుకొన్నాయి. సచివాలయానికి సీఎం జగన్ వెళ్లే అవకాశం ఉన్నందున  పవన్ కళ్యాణ్ పర్యటనలో మార్పులు చేర్పులు చోటు చేసుకొన్నాయి.

పవన్ కళ్యాణ్ ఎర్రబాలెంలో రైతుల ధర్నాలో పాల్గొంటారు. అక్కడి నుండి తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో కూడ పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.  

ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని పరిపాలన వికేంద్రీకరణ అవసరం లేదని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ నివేదిక ఇప్పటికే నివేదిక ఇచ్చింది. 

బోస్టన్ కమిటీ కొత్తసంవత్సరం జనవరి 3వ తేదీన నివేదిక ఇవ్వనుంది.ఈ నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తోంది.ఈ నివేదికను సీఎంకు హైపవర్ కమిటీ ఇవ్వనుంది.ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.