జనసేన అధినేత పవన్ కల్యాణ్కు వైరల్ ఫీవర్..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో బుధవారం జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ వాయిదా వేసినట్టుగా సమాచారం. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. వివరాలు.. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లే అంశంపై పవన్ కల్యాణ్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కీలక సమావేశాన్నివాయిదా వేస్తున్నట్టుగా జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ సమావేశానికి సంబంధించిన మరో తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నాయి.