రైతుల ఇబ్బందులపై ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. బురద రాజకీయాలు తమకు తెలియదని... రైతులకు భరోసా కల్పించడంలో పాలక పక్షం విఫలమైందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

రైతులకు అండగా నిలబడటం జనసేన (janasena) బాధ్యత అన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. బురద రాజకీయాలు తమకు తెలియదన్నారు. వ్యవసాయ రంగంపై (agriculture) ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని పవన్ విమర్శించారు. నష్టాలు, రుణ భారంతో రైతులు కృంగిపోతున్నారని.. వారిలో మనస్థైర్యం నింపేలా అధికారులు చొరవ తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. రైతులకు భరోసా కల్పించడంలో పాలక పక్షం విఫలమైందని.. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు (farmers suicide) బాధాకరమన్నారు. 

కాగా.. రైతు సమస్యలపై మంగళవారం ఏపీ ప్రభుత్వాన్ని (ap govt) ప్రశ్నించారు పవన్ కల్యాణ్ (pawan kalyan). అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతుల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న హామీ ఏమైందని పవన్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ని రైతు కుటుంబాలకు రూ.50 చొప్పున పంట పెట్టుబడి ఇచ్చారని క్వశ్చన్ చేశారు పవన్. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. 

పంటకు పెట్టుబడి లేదు.. రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకోరు.. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించరు, పండిన పంటను తీసుకుని కూడా డబ్బులు ఇవ్వరని పవన్ ఫైరయ్యారు. ఏ దశలోనూ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడటం లేదని ఆయన మండిపడ్డారు. అన్నం పెట్టే రైతులను కూడా కులాల వారీగా విభజించడమే ప్రభుత్వం చేసిన పనంటూ ఆయన ఆరోపించారు. 

రైతుల గురించి మాట్లాడతాం కానీ .. రైతులా నటించడం గురించి మాట్లాడటం వృథా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (kakani govardhan reddy). తెలుగు దేశం (telugu desam party) సానుభూతి పరుల గురించి మాట్లాడటం వేస్ట్ అన్నారు కాకాణి. సీఎం జగన్ హయాంలో ఏపీ రైతులు హ్యాపీగా వున్నారని ఆయన పేర్కొన్నారు.