ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీని నుంచి విముక్తి చేయాలంటే.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీని జీరో చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీని నుంచి విముక్తి చేయాలంటే.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీని జీరో చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఇక్కడ 34 స్థానాల్లో వైసీపీని ఒక్క స్థానంలో కూడా గెలవనివ్వకూడదని అన్నారు. అంబేద్కర్ కొనసీమ జిల్లా రాజోలు నియోజకర్గ జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. నేరపూరిత రాజకీయాలకు తాను వ్యతిరేకమని చెప్పారు. ఏ కులమైనా, ఏ మతమైనా.. క్రిమినల్స్ రాజ్యాలు ఏలితే తనకు చిరాకు అని చెప్పారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆజాద్ వంటి పాఠాలు నేర్పించి.. జగన్ మోహన్ రెడ్డి వంటి వ్యక్తుల పాలనలో తలవంచుకుని బతకలేనని అన్నారు.
రూ. 200 లంచం తీసుకుంటే సాధారణ ఉద్యోగికి శిక్ష వేస్తారని.. రూ. 5 వేల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తికి శిక్ష పడదని.. ఎందుకంటే వాళ్లే అధికారంలో ఉంటారని.. ఇది మన దేశంలోని దౌర్భగ్యామని అన్నారు. కుల ప్రతిపాదికన రాజకీయాలు చేస్తే వ్యవస్థ నాశనం అవుతుందని.. అదే పని వైసీపీ చేస్తోందని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులకు జవాబుదారీతనం ఉండాలని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారికి ప్రజలు రీకాల్ చేసే విధంగా చట్టాలు రావాలని అన్నారు.
వైసీపీ చేసినట్టుగా తాను కుల రాజకీయాలు చేయనని చెప్పారు. వైసీపీ నేతలు పులివెందుల సంస్కృతి అన్నిచోట్లకు తెచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని అన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా జనసేన నిలదొక్కుకుంటుందని.. పార్టీ భావజాలంపై ఆకర్షితులవుతున్నారనే దానికి ఇదే నిదర్శనమని చెప్పారు. పులివెందుల నుంచి ఇక్కడి దాకా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు.. తాము ఇక్కడి నుంచి పులివెందులకు వచ్చి సీఎం జగన్‌కు సంస్కారం నేర్పిస్తామని అన్నారు.
