అమరావతి: మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై అంతా కలిసి కట్టుగా పోరాడాలని పవన్ సూచించారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లలో జరిగిన నష్టాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన పార్టీ హాజరైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించారు.

రాష్ర అభివృద్ధికి అన్ని పార్టీలు ఒకేతాటిపైకి వచ్చి కేంద్రంపై పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. ఎవరు ఏ లెక్క చెప్పినా రాష్ట్రానికి మాత్రం అన్యాయం జరిగిందన్నది వాస్తవమన్నారు. 

ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పోరాటం చెయ్యాలని కోరారు. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన సమావేశానికి హాజరైన పవన్ కల్యాణ్ పై ఉండవల్లి ప్రశంసలు కురిపించారు. 

పవన్ స్వయంగా ఈ సమావేశానికి హాజరవ్వడంతో ఆయన గ్లామర్ పెరిగిందని ఉండవల్లి చమత్కరించారు. ఆంధ్రా వాళ్లంటే కోటీశ్వరులు, వ్యాపారులేనని వారికి రాష్ట్రం అవసరం లేదని ఢిల్లీలో అంటుంటారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. పార్టీలు వేరైనా టైం వస్తే ఆంధ్రులు ఒక్కటేనన్న భావన ఉత్తరాది వారికి కలిగించాలని ఉండవల్లి సూచించారు.     

 

ఈ వార్తలు కూడా చదవండి

మీలో మీరు కొట్టుకు చచ్చినా.. రాష్ట్రం కోసం పోరాడండి: పార్టీలపై ఉండవల్లి సెటైర్లు