Asianet News TeluguAsianet News Telugu

పోరాడితే సాధ్యం కానిదేది లేదు.. మోడీది రాజనీతిజ్ఞత : వ్యవసాయ చట్టాల ఉపసంహరణపై పవన్ స్పందన

మూడు వ్యవసాయ చట్టాలను (farm laws) వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ప్రకటించడంపై జనసేన (janasena party) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) సైతం స్పందించారు.  ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన తెలిపారు. రైతు చట్టాల ఉపసంహరణలో ప్రధాని రాజనీతిని ప్రదర్శించారని పవన్ ప్రశంసించారు.

janasena chief pawan kalyan reacts pm modi farm laws withdraw decision
Author
Amaravati, First Published Nov 19, 2021, 4:43 PM IST

మూడు వ్యవసాయ చట్టాలను (farm laws) వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ప్రకటించడంపై దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన (janasena party) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) సైతం స్పందించారు. ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన తెలిపారు. రైతు చట్టాల ఉపసంహరణలో ప్రధాని రాజనీతిని ప్రదర్శించారని పవన్ ప్రశంసించారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోయాయని జనసేనాని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మూడు చట్టాలను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఉపసంహరిస్తామని ప్రకటించడం ఆయనలోని రాజనీతిజ్ఞతను చాటుతోందని పవన్  అన్నారు. 

గురునానక్ జయంతి (guru nanak jayanti) సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగం జనవాక్కును శిరోధార్యంగా భావించినట్టు అర్థమవుతోందని ఆయన  వ్యాఖ్యానించారు. ఏడాది కాలంగా రైతులు చేసిన పోరాటానికి ఒక ఫలప్రదమైన ముగింపు లభించిందని, ఇది శుభపరిణామం అని పవన్ హర్షం వ్యక్తం చేశారు. పోరాడితే సాధ్యం కానిది ఏదీ లేదనేది రైతుల ఉద్యమంతో మరోసారి నిరూపితమైందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల పోరాటాన్ని రాజకీయ కోణం నుంచి కాకుండా ఒక సామాజిక అంశంగా భావించి చట్టాలను ఉపసంహరించుకోవడానికి నిర్ణయం తీసుకున్న బీజేపీ (bjp) నాయకత్వానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. 

Also Read:farm laws repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ

మరోవైపు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలపై పవన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా కడప జిల్లా (kadapa district) చెయ్యేరులో (cheyyeru river) 30 మంది గల్లంతవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. శివాలయంలో దీపారాధనకు వెళ్లిన భక్తులు, పూజారి కొట్టుకుపోయారన్న సమాచారం తనను బాధకు గురిచేసిందని పేర్కొన్నారు. చెయ్యేరులో కొట్టుకుపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నారని పవన్ వివరించారు. వరద ఉద్ధృతిని అధికార యంత్రాంగం ముందుగా అంచనా వేసుంటే బాగుండేదని, ప్రజల్ని ఆ మేరకు అప్రమత్తం చేస్తే ఈ ఘటన జరిగుండేది కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 

అంతకుముందు కేంద్రం తీసుకుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. ఉదయం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో (parliament winter session 2021) దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. రైతులందరినీ క్షమాపణ కోరుతున్నట్టుగా మోదీ చెప్పారు. రైతులు  ఆందోళన విరమించాలని కోరారు. కాగా, ఈ సాగు చట్టాలను రద్దు చేయాలని గత ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios