ఇటీవల కన్నుమూసిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు

ఇటీవల కన్నుమూసిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. శనివారం నంద్యాల చేరుకున్న ఆయన.. ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించి ఆయన కుమారుడు సుజల, అల్లుడితో కాసేపు ముచ్చటించారు.

ఎస్పీవై రెడ్డి మృతి చెందిన రోజు విదేశీ పర్యటనలో ఉండటంతో పవన్ ఆ రోజు నంద్యాల రాలేకపోయారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్ధిగా నంద్యాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఎస్పీవై రెడ్డి అక్కడ చికిత్స పొందుతూ గత నెల 30న కన్నుమూశారు.