జనసేన పార్టీ పత్రిక 'శతఘ్ని'ని ఆ పార్టీ చీప్  పవన్ కళ్యాణ్ గురువారం నాడు హైద్రాబాద్‌లో విడుదల చేశారు. పార్టీ సిద్దాంతాలను  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పత్రిక ఉపయోగించుకొంటామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

హైదరాబాద్: జనసేన పార్టీ పత్రిక 'శతఘ్ని'ని ఆ పార్టీ చీప్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు హైద్రాబాద్‌లో విడుదల చేశారు. పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పత్రిక ఉపయోగించుకొంటామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గురువారం నాడు పార్టీ కార్యాలయంలో జనసేన చీఫ్ పార్టీ పక్షపత్రిక శతఘ్నిని ఆవిష్కరించారు. జనసేన సిద్దాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వీలుగా ఈ పత్రికను వెలువరించనున్నట్టు జనసేన ప్రకటించింది.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి జనసేన పార్టీ సభ్యత్వాన్ని 50 లక్షలకు చేరువయ్యేలా చేయాలని పార్టీ చీఫ్ వపన్ కళ్యాణ్ ఆదేశించారు. అంతేకాకుండా ఈ నెలలో వాడవాడలా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు.

జనసేన ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేయనున్న కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను ఈ పత్రికలో పొందుపర్చనున్నారు.పార్టీ క్యాడర్‌కు ఈ పక్షపత్రిక ఓ ఆయుధంగా ఉపయోగపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ వార్తను చదవండి:పవన్‌తో మధ్యాహ్నం భేటీ: జనసేనలోకి మోత్కుపల్లి