ఇక పాతికేళ్లు ప్రజాసేవకే అంకితం, త్వరలో రెండో దశ పోరాట యాత్ర : పవన్ కళ్యాణ్

JanaSena Chief Pawan Kalyan inaugurating JSP IT Centre in Raidurgam
Highlights

సమాజం కోసం, ప్రజలకోసం స్వచ్చందంగా పనిచేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఈ పాతికేళ్ల పాటు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజేసేవకు అంకితం చేస్తానని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికే జనసేన పార్టీని స్థాపించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ పాతికేళ్లు ఈ విలువలకే కట్టుబడి ఉంటానని పవన్ స్పష్టం చేశారు.
 
జనసేన పార్టీ ఐటీ విభాగాన్ని రాయదుర్గంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో పూజలు చేసి వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ...జనసేన పార్టీ మిస్డ్ కాల్ ద్వారా చేపట్టిన సభ్యత్వ కార్యక్రమానికి విశేస స్పందన వచ్చిందని, దీని ద్వారా 10 లక్షల మంది సభ్యత్వం పొందారని అన్నారు. అయితే రెండు కోట్ల మందిని జనసేనలో సభ్యులుగా చేర్చాలన్న  లక్ష్యంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని పవన్ సూచించారు.

ఇక జనసేన ఐటీ విభాగానికి ఇంచార్జిగా తోట చంద్రశేఖర్ పనిచేస్తారని, ఆయన పర్యవేక్షణలోనే ఐటీ విభాగం పనిచేస్తుందని పవన్ ప్రకటించారు. ఇక్కడ పనిచేసే వారందరితో త్వరలో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని, అక్కడ ప్రతి ఒక్కరితో సమావేశమవుతానని పవన్ హామీ ఇచ్చారు. 

ఇక త్వరలోనే పవన్ రెండో దశ పోరాటయాత్ర ప్రారంభించనున్నట్లు సమాచారం.  రెండో దశ యాత్రను ఏలూరు లేదా భీమవరం నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం.  

loader