Asianet News TeluguAsianet News Telugu

ఇలాంటి నాయకులు పాలిస్తుంటే మానభంగాలెలా ఆగుతాయి..: పవన్ సీరియస్

సిఎం భద్రత పేరుతో నిరుపేదల ఇళ్లను ఖాళీ‌ చేయిస్తారా? అని జనసేనాని పవన్ కల్యాణ్ జగన్ సర్కార్ ను నిలదీశారు. 

janasena chief pawan kalyan fires on ycp leaders akp
Author
Amaravati, First Published Jul 7, 2021, 2:10 PM IST

అమరావతి: జగన్ సర్కార్ పై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆడపడుచులపై గౌరవం లేకుండా పచ్చిబూతులు తిట్టే నాయకులు రాష్ట్రాన్ని పాలిస్తుంటే మానభంగాలు ఎలా ఆగుతాయంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం తనను కలిసిన తాడేపల్లి కరకట్ట వాసులకు పవన్ భరోసా ఇచ్చారు.  జగన్మోహన్ రెడ్డి ‌నివాసం‌ సమీపంలోని అమరారెడ్డి నగర్ కాలనీవాసులను బలవంతంగా ఖాళీ చేయించడానికి మొండిగా ముందుకెళితే జనసేన తరపున సిఎం నివాసం వద్దే ఉద్యమిస్తామని పవన్ హెచ్చరించారు. 

read more  ప్రస్తుతం జనసేన పార్టీని నడపడం సాహసమే: పవన్ కల్యాణ్ సంచలనం

''సిఎం భద్రత పేరుతో నిరుపేదల ఇళ్లను ఖాళీ‌ చేయిస్తారా? సీఎం ఇంటి‌చుట్టూ ఉన్న‌వారికే రక్షణ లేదు. 35 ఏళ్లుగా ఉన్నవారికి పునరావాసం కల్పించాలి. భయపెట్టి.. బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడరు. ఖాళీ చేయించడం తప్పని సరైతే వారికి ముందు న్యాయం చేయాలి. 350కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాకే ఖాళీ చేయించాలి'' అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 

ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇవాళ(బుధవారం) హైదరాబాద్ నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. అక్కడినుండి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా అమరారెడ్డి నగర్ కాలనీ బాధితులతో పాటు జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ నిరుద్యోగులు, ప్రంట్ లైన్ వారియర్స్, కరోనాతో మరణించిన జనసేన నాయకులు, కాార్యకర్తల కుటుంబసభ్యులు పవన్ కల్యాణ్ ను కలిశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios