Asianet News TeluguAsianet News Telugu

ప్రస్తుతం జనసేన పార్టీని నడపడం సాహసమే: పవన్ కల్యాణ్ సంచలనం

 అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దామని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

pawan kalyan sensational comments on janasena party akp
Author
Mangalagiri, First Published Jul 7, 2021, 12:48 PM IST

నంద్యాల: ప్రస్తుత పరిస్థితిలో జనసేన పార్టీని నడపడం సాహసోపేతమైన చర్యగా ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన పార్టీ జనంలోనే, జనంతోనే ఉంటుందన్నారు. మీ అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దామని పవన్ పిలుపునిచ్చారు. 

హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ అక్కడనుండి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కరోనాతో మృతిచెందిన వారికి‌ నివాళులు అర్పించారు. నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేష్ కుటుంబ సభ్యులుకు ఐదు లక్షల చెక్ ను అందచేశారు పవన్. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఎంతోమంది జనసేన నాయకులు, జనసైనికులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. జన సైనికులను కోల్పోవడం నన్ను వ్యక్తిగతంగా ఎంతో బాధించింది. వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని అన్నారు. 

Silver screen: జగన్ పై బయోపిక్... పవన్ కళ్యాణ్ కాస్ట్లీ కార్

''కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడవడానికి పెట్టిన పార్టీ జనసేన. కరోనా సమయంలో జనసైనికుల జనసేవ మర్చిపోలేనిది. వారు ఎంతో నిస్వార్థంగా సేవ చేశారు, వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా'' అన్నారు. 

''ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ఆపత్కాలంలో లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున భీమా సౌకర్యం కల్పించాం. ఈ భీమా పథకానికి నా వంతుగా కోటి రూపాయలు ఇచ్చాను. ప్రాణాలను ఫణంగా పెట్టి జన సైనికులు ముందుకు వెళుతున్నారు'' అన్నారు పవన్ కల్యాణ్.   
 

Follow Us:
Download App:
  • android
  • ios