జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్న మహిళా కార్యకర్త తల్లి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం పవన్ రూ.లక్ష విరాళం అందించారు.

అనంతపురం జిల్లా తనకల్లు మండలం జడ్పీటీసీ అభ్యర్ధి లక్ష్మీ ప్రసన్న యోగి తల్లి గత కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాము కాటుకు గురై, తీవ్ర ఆరోగ్య సమస్యలతో గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వైద్య ఖర్చుల నిమిత్తం ఆమె ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక జనసేన నాయకులు ద్వారా తెలుసుకున్న పవన్ కల్యాణ్ చలించిపోయారు.

లక్ష్మీప్రసన్నకు సాయం చేయాలని భావించిన ఆయన ఈ మొత్తాన్ని హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి గ్లోబల్ ఎన్.ఆర్.ఐ జనసేన సహకారం అందించింది.