Asianet News TeluguAsianet News Telugu

జనసేన కార్యకర్త ఈశ్వరయ్యపై దాడి చేసిన వారిపై చర్యలకు పవన్ డిమాండ్

 అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని మల్లాపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త  మేకల ఈశ్వరయ్యపై వైసీపీ వర్గానికి చెందినవారు విచక్షణారహితంగా దాడికి పాల్పడటాన్ని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. 
 

janasena chief pawan kalyan demands take action against ysrcp leaders who attacked on eshwaraiah
Author
Anantapur, First Published May 27, 2020, 3:57 PM IST


అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని మల్లాపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త  మేకల ఈశ్వరయ్యపై వైసీపీ వర్గానికి చెందినవారు విచక్షణారహితంగా దాడికి పాల్పడటాన్ని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. 

 గ్రామంలో తమ జెండా తప్ప జనసేన జెండా కనిపించకూడదనే నియంతృత్వ, ఫ్యాక్షన్ పోకడలతో చేసిన దాడిగా జనసేన అభిప్రాయపడింది. జనసేన కార్యక్రమాలు చేయకూడదు, జెండా కట్టకూడదని  పుట్టపర్తి ఎమ్మెల్యే అనుచరులు హుకుం జారీ చేసినా పార్టీపై అభిమానంతో ఈశ్యరయ్య ముందుకు వెళ్లాడని ఆయన గుర్తు చేశారు.

ఈశ్వరయ్యపై దాడిని  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు చిలకం మధుసూదన రెడ్డి, రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యులుఆకుల ఉమేష్ పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకువచ్చారు. 

అదే విధంగా గ్రామంలో బోరు వేసే విషయాన్ని సాకుగా తీసుకుని జనసేన కార్యకర్తపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు కారకులైన అధికార పక్షం వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా పోలీసు యంత్రాంగంపై ఉందన్నారు.

కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  ఈశ్వరయ్యకు పార్టీ అండగా ఉంటుందని పార్టీ నేతలు హామీ ఇచ్చారు.  జనసేన కార్యకర్తలపై దాడులకు తెగబడి, తప్పుడు కేసులు దాఖలు చేసి బెదిరిస్తున్న ఘటనలు అన్ని జిల్లాల్లో చోటుచేసుకొంటున్నాయని జనసేన ఆరోపించింది. తమ పార్టీ కార్యకర్తలపై దాడులపై  సమగ్ర నివేదిక సిద్ధం చేసి చట్టపరంగా ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios