Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ: పవన్ కల్యాణ్ స్పందన ఇదీ....

ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చిరంజీవి రాజకీయ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని పవన్ స్పష్టం చేశారు. చిరంజీవి తన మేలు కోరే వ్యక్తని.. అందులో రెండో మాటే లేదని జనసేనాని వ్యాఖ్యానించారు.

janasena chief pawan kalyan comments on chiranjeevi political re entry ksp
Author
Hyderabad, First Published Jan 29, 2021, 9:55 PM IST

ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చిరంజీవి రాజకీయ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని పవన్ స్పష్టం చేశారు. చిరంజీవి తన మేలు కోరే వ్యక్తని.. అందులో రెండో మాటే లేదని జనసేనాని వ్యాఖ్యానించారు.

చిరంజీవి నైతిక మద్ధతు తనకు ఎప్పుడూ ఉంటుందని.. తాను విజయం సాధించాలని కోరుకుంటారే తప్ప ఓడిపోవాలనుకోరని పవన్ వెల్లడించారు. చిరంజీవి జనసేనలో చేరతారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని పవన్ కుండబద్ధలు కొట్టారు.

janasena chief pawan kalyan comments on chiranjeevi political re entry ksp

చిరంజీవి జనసేనలో చేరిక పరిస్ధితులను బట్టి ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. చిరంజీవి పార్టీలో చేరడం, చేరకపోవడం అన్నది ఆయన అభిప్రాయమని జనసేనాని తేల్చి చెప్పారు.

జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గత కొన్నిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో చిరంజీవి త్వరలో పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Also Read:పవన్ కల్యాణ్ వెంట చిరంజీవి వస్తున్నారు: నాదెండ్ల మనోహర్

కాగా, చిరంజీవి జనసేనకు దూరంగా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పవన్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. నాగబాబు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.

janasena chief pawan kalyan comments on chiranjeevi political re entry ksp

చిరంజీవి కుమారుడు రామ్ చరణ్.., సోషల్ మీడియాలో జనసేనకు మద్దతు పలకగా.., వరుణ్ తేజ్, నిహారికా నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ కూడా జనసేనకు మద్దతుగా ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు.

చిరంజీవి బహిరంగంగా మద్దతు పలకకపోయినా.., తమ్ముడికి నైతికి మద్దతు ఇస్తూనే ఉన్నారు. జనసేన వైపు ఉండాలని అభిమాన సంఘాలకు సూచించారు
 
Follow Us:
Download App:
  • android
  • ios