Asianet News TeluguAsianet News Telugu

రండి కలిసి పోరాడుదాం: భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై పవన్ పిలుపు

భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం పార్టీలన్ని సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు స్పందించాయని..విపత్కర పరిస్థితులపై పోరాటానికి మిగిలిన పార్టీలు ముందుకు రావాలని పవన్ కోరారు

Janasena chief Pawan kalyan comments on Building construction workers suicides
Author
Amaravathi, First Published Oct 28, 2019, 7:31 PM IST

భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం పార్టీలన్ని సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు స్పందించాయని..విపత్కర పరిస్థితులపై పోరాటానికి మిగిలిన పార్టీలు ముందుకు రావాలని పవన్ కోరారు.

భవన నిర్మాణ కార్మికుల ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జనసేనాని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని.. నెలల తరబడి ఉపాధిలేక కష్టాలపాలై వారు ప్రాణాలు తీసుకుంటున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

బాధ్యతగల రాజకీయ పార్టీలుగా మనమంతా కలిసి పోరాడాలని.. నవంబర్‌ 3న విశాఖలో వారికి సంఘీభావం తెలుపుదామని జనసేన పిలుపునిచ్చారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రీసెంట్ గా ఆత్మహత్య చేసుకున్న తాపీమేస్త్రి కుటుంబానికి అండగా నిలిచారు. తనవంతు సహాయంగా లక్ష రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

గుంటూరు, తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో చింతం నాగ బ్రహ్మజీ (35) అనే తాపీమేస్త్రీ గత 5 నెలలుగా పనులు లేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తనకు పనిలేకపోవడం చిన్నపిల్లల్ని వదిలేసి భార్య కూలీకి వెళ్లడంతో మనస్తాపం చెందిన బ్రహ్మాజీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.  దీంతో ఒక్కసారిగా ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సూసైడ్ చేసుకున్న నాగ బ్రహ్మాజీకి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను.

Also read:ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మాజీకి జనసేన అండ.. పవన్ విరాళం

అతని మరణం నన్ను తీవ్ర బాధను కలిగించింది. ఆంధ్రప్రదేశ్ లో భావన నిర్మాణాల కార్మికుల దుస్థితికి బ్రహ్మాజీ ఆత్మహత్య నిదర్శనం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఇసుక అస్థవస్థ డీలింగ్స్ కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.  

దాదాపు 19.6లక్షల మంది నేరుగా అలాగే 10 లక్షలకు పైగా కార్మికులు పరోక్షంగా ఉపాధి కోల్పోతున్నారు. దాదాపు 30 లక్షల మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని వెంటనే ఆదుకోవాలని వారు దుర్భర జీవనాన్ని గడుపుతున్నారని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. 

Also Read:కార్మికుల ఆత్మహత్యలపై చంద్రబాబు ఆవేదన... ప్రభుత్వంపై సీరియస్

Follow Us:
Download App:
  • android
  • ios