అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ బీబీ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ బీబీ హరిచందన్ తో పలు అంశాలపై చర్చించారు. 

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బీబీ హరిచందన్ తో పలు అంశాలపై చర్చించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు సైతం గవర్నర్ హరిచందన్ ను కలిశారు. 

అపార రాజకీయ అనుభవం కలిగిన హరిచందన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా రావడంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి లేమి, నిధుల  కొరత, అసంపూర్తిగా మిగిలిపోయిన విభజన హామీలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా ఉండాలని వారు కోరారు.