Asianet News TeluguAsianet News Telugu

జనసేన, బీజేపీ నేతల భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై నేడు కీలక ప్రకటన

బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతల సమావేశం గురువారం నాడు విజయవాడలో ప్రారంభమైంది. 

Janasena, BJP leaders meeting in Vijayawada
Author
Amaravathi, First Published Jan 16, 2020, 11:54 AM IST


విజయవాడ: విజయవాడలోని ఓ హోటల్‌లో బీజేపీ, జనసేన పార్టీ నేతలు సమావేశమయ్యారు. అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల విషయమై రెండు పార్టీల మధ్య చర్చలు జరగనున్నాయి.

Also read:నాలుగేళ్ల ప్లాన్: పవన్‌తో చర్చలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న  రాజకీయ పరిస్థితులపై రెండు పార్టీల నేతల మధ్య చర్చించనున్నారు. ఈ రెండు పార్టీల నేతలు పలు అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

Also read: వైఎస్ జగన్ పై ఫైట్: బిజెపి నేతలతో పవన్ కల్యాణ్ భేటీపై ఉత్కంఠ

ప్రస్తతం ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. ఈ పొత్తుల గురించి ప్రధానంగా చర్చ సాగనుంది. 

Also Read: 16న భేటీ: బీజేపీతో కలిసి జగన్ పై పోరుకు పవన్ కల్యాణ్ వ్యూహరచన

మరో వైపు 2024 ఎన్నికల్లో కూడ ఈ రెండు పార్టీలు కూడ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల వరకు పొత్తును కొనసాగించే అవకాశంపై కూడ చర్చించనున్నారు.

Also Read: జగన్ మీద ఫైట్: బిజెపి అస్త్రం పవన్ కల్యాణ్, చంద్రబాబు వెనక్కి

జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు, బీజేపీ తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఇంచార్జీ సునీల్ దియోధర్‌,  మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు సమావేశంలో పాల్గొన్నారు.

also read:అమరావతి: విశాఖకు రాజధాని తరలించొద్దంటూ సీఆర్‌డీఏకు రైతుల అభ్యంతరాలు

గురువారం మధ్యాహ్నం  మూడు గంటలకు జనసేన, బీజేపీ నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.ఈ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు నేతలు.

Follow Us:
Download App:
  • android
  • ios