సారాంశం

మచిలీపట్టణం పార్లమెంట్ స్థానం నుండి  జనసేన అభ్యర్ధిగా బాలశౌరిని బరిలోకి దింపింది  జనసేన. ఈ మేరకు ఆ పార్టీ ఇవాళ  మీడియాకు ప్రకటన విడుదల చేసింది.

మచిలీపట్టణం:మచిలీపట్టణం  పార్లమెంట్ స్థానం నుండి  వల్లభనేని బాలశౌరిని అభ్యర్ధిగా ప్రకటించింది జనసేన. ప్రస్తుతం ఇదే పార్లమెంట్ స్థానం నుండి  బాలశౌరి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బాలశౌరి మచిలీపట్టణం ఎంపీ స్థానం నుండి  పోటీ చేసి విజయం సాధించారు.  ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  బాలశౌరి  వైఎస్ఆర్‌సీపీని వీడి  జనసేనలో చేరారు.మచిలీపట్టణం నుండి బాలశౌరిని అభ్యర్ధిగా  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఇవాళ ప్రకటించారు. 

ఈ ఎన్నికల్లో  తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తుంది.  జనసేన 21 అసెంబ్లీ,రెండు ఎంపీ స్థానాల్లో  పోటీ చేస్తుంది.  కాకినాడ పార్లమెంట్ స్థానానికి ఉదయ్ పేరును ఇప్పటికే  జనసేన ప్రకటించింది. మచిలీపట్టణం పార్లమెంట్ స్థానానికి బాలశౌరి  పేరును ఖరారు చేసినట్టుగా  జనసేన  ఇవాళ ప్రకటించింది.ఆవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి,పార్లమెంట్ కు  మే  13న ఎన్నికలు జరగనున్నాయి.  2019 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది. ఈ దఫా  వైఎస్ఆర్‌సీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి.  అయితే  ఈ దఫా మరోసారి అధికారంలోకి రావాలని  వైఎస్ఆర్‌సీపీ పట్టుదలగా ఉంది.