ఏపీలో మారుతున్న సమీకరణాలు: బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న పవన్
ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీతో పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ మేరకు వారికి అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీతో పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ మేరకు వారికి అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది.
also read:పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీ: ఆర్ఎస్ఎస్ నేతలతో భేటీ, ఏం జరుగుతోంది?
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుందామనే అభిప్రాయం జనసేన విస్తృత స్థాయి సమావేశంలో వ్యక్తమైంది. ఆ సమయంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. దాంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
Also read:రంగంలోకి బీజేపీ, ఢిల్లీకి పవన్: వారంలో తేలనున్న అమరావతి భవితవ్యం?
పవన్ కల్యాణ్ ఒక్కసారి చంద్రబాబు వైపు వెళ్తే తిరిగి తమ వైపు రావడం కష్టమవుతుందనే ఉద్దేశంతో బిజెపి పెద్దలు ఆయనను ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపి బిజెపితో పొత్తుకు ఆర్ఎస్ఎస్ నేతలు ఒప్పించినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం ఆయన ఆర్ఎస్సెస్ నేతలతో సమావేశమైన జనసేనాని.. ఇవాళ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అమరావతి తరలింపు, మూడు రాజధానుల గురించి వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఈ భేటీలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల జరిగిన నష్టాలను విశ్లేషించినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నడ్డా తెలపడంతో అందుకు పవన్ కూడా సానుకూలంగా స్పందించారని జనసేన వర్గాల టాక్.
ఏపీలో వైసీపీ ఎదుర్కోవాలంటే బీజేపీతో పొత్తు అవసరమని పవన్ కల్యాణ్ కూడా భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నారు. జనసేన, బీజేపీలతో పొత్తు ఖరారైతే స్థానిక సంస్థల నుంచి రెండు పార్టీల మధ్య మైత్రి బంధం ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.