పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీ: ఆర్ఎస్ఎస్ నేతలతో భేటీ, ఏం జరుగుతోంది?
ఏపీ రాష్ట్ర రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారు. మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆర్ఎస్ఎస్ నేతలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలను వెల్లడించేందుకు పవన్ కళ్యాణ్ నిరాకరించారు.
Also read:అమరావతిలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ: ఎమ్మెల్యే అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై బీజేపీ పెద్దలతో చర్చించేందుకు వపన్ కళ్యాణ్ ఈనెల 11వ తేదీన ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ వరుసగా ఢిల్లీలో పలువురు బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు.
Also read:రంగంలోకి బీజేపీ, ఢిల్లీకి పవన్: వారంలో తేలనున్న అమరావతి భవితవ్యం?
సోమవారం నాడు ఆర్ఎస్ఎస్ నేతలతో పవన్ కళ్యాణ్ , ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌లు సమావేశమయ్యారు.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలనే డిమాండ్‌తో పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో సమావేశం నిర్వహిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
భవిష్యత్తులో బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ నేతలతో కలవడం కూడ ప్రాధాన్యతను సంతరించుకొంది.
గతంలో కూడ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో రహస్యంగా కలిశారు. ఈ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ, బీజేపీలు కూడ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.
అమరావతి పరిరక్షణ జేఎసీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో టీడీపీ, సీపీఐలు ఉమ్మడిగా పాల్గొంటున్నాయి. కానీ, బీజేపీ, జనసేనలు వేర్వేరుగా కార్యాచరణను రూపొందించుకొన్నాయి.
ఢిల్లీ పెద్దల నుండి పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ మూడు రోజులుగా బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్తారోననే అంశంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.