Asianet News TeluguAsianet News Telugu

TDP-JSP: రైతు స‌మ‌స్య‌ల‌పై పోరుకు సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మి..

TDP, JSP alliance: రైతులకు మద్దతుగా, రైతుల కష్టాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు జ‌న‌సేన‌-టీడీపీ రెండు పార్టీలు ఉమ్మడిగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాయి. దీనిలో భాగంగా నవంబర్ 4న గుంటూరు, 5న ప్రకాశం, 6న కర్నూలు, 7న సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఆయా పార్టీల‌ బృందాలు పర్యటించి రైతులతో మాట్లాడనున్నాయి. రాష్ట్రంలో అత్యంత దుర్మార్గమైన ప్రజావ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే తమ కూటమి లక్ష్యమని జనసేన సమన్వయకర్త శ్రీనివాసరావు పేర్కొన్నారు.
 

Jana Sena-TDP alliance gearing up to fight on farmers' issues, Chandrababu Naidu, Pawan Kalyan RMA
Author
First Published Nov 1, 2023, 12:30 AM IST

Anantapur: రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి ముందుకు సాగ‌నున్న‌ట్టు జ‌న‌సేన‌, తెలుగుదేశం పార్టీలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ఈ కూటమి మ‌రో పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. రైతులకు మద్దతుగా, రైతుల కష్టాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు జ‌న‌సేన‌-టీడీపీ రెండు పార్టీలు ఉమ్మడిగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాయి. దీనిలో భాగంగా నవంబర్ 4న గుంటూరు, 5న ప్రకాశం, 6న కర్నూలు, 7న సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఆయా పార్టీల‌ బృందాలు పర్యటించి రైతులతో మాట్లాడనున్నాయి. రాష్ట్రంలో అత్యంత దుర్మార్గమైన ప్రజావ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే తమ కూటమి లక్ష్యమని జనసేన సమన్వయకర్త శ్రీనివాసరావు పేర్కొన్నారు.

టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ అనంత‌పురంలోని ఒక ప్ర‌యివేటు కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సమావేశంలో పరస్పర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, జేఎస్‌పీ జిల్లా పరిశీలకులు చొల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు పార్టీల పొత్తు వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో సమన్వయకర్తలుగా ఎన్‌ఎండి ఫరూక్‌, జెఎస్‌పి సిహెచ్‌ శ్రీనివాసరావులను టీడీపీ నియమించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి 160 సీట్లు గెలుచుకుంటుందని కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఎస్పీ కూడా భాగస్వామ్యమై 'బాబు షూరిటీ-భవిశత్తుకు హామీ' కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు.

రైతులకు మద్దతుగా, రైతుల కష్టాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు రెండు పార్టీలు ఉమ్మడిగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాయి. ఉమ్మడి బృందాలు నవంబర్ 4న గుంటూరు, 5న ప్రకాశం, 6న కర్నూలు, 7న సత్యసాయి, అన్నమయ జిల్లాల్లో పర్యటించి రైతులతో మమేకమవుతారు. రాష్ట్రంలో అత్యంత దుర్మార్గమైన ప్రజావ్యతిరేక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే మహాకూటమి ధ్యేయమని జేఎస్పీ సమన్వయకర్త శ్రీనివాసరావు అన్నారు. టీడీపీకి 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకులు ఉండగా, జేఎస్పీకి యోధుల స్ఫూర్తి ఉన్న పోరాట నాయ‌కులు ఉన్నార‌నీ, ఈ కూటమి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముద్ర వేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

రైతులు, యువత, ఇతర వర్గాల సమస్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇది జ‌న‌సేన‌-టీడీపీ రెండు పార్టీలు చేస్తున్న న్యాయమైన యుద్ధమనీ, 2024 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కలయిక క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్య‌క్తంచేశారు. కాగా, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, కె.వెంకట ప్రసాద్, బీకే పార్థసారధి, పరిటాల శ్రీరామ్, పార్టీ నాయకులు జితేంద్ర గౌడ్, ఈరంబా, అశ్మిత్ రెడ్డి, హనుమంతరాయ చౌదరి, జేఎస్పీ జిల్లా అధ్యక్షుడు బండారు శ్రావణి, వరుణ్‌తోపాటు నాయకులు రవికుమారి, భవాని, మధుసూదన్‌రెడ్డి తదితరులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios