వైసీపీ విముక్త ఏపీయే టార్గెట్, మా ప్లాన్స్ మాకున్నాయి:పవన్ కళ్యాణ్
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తమ లక్ష్యమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మేరకు తమ ప్లాన్స్ తమకు ఉన్నాయన్నారు.
గుంటూరు: సమయాన్ని బట్టి మా వ్యూహాన్ని మార్చుకొంటామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తమ లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు. సోమవారం నాడు ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీ విముక్త ఏపీ రాష్ట్రం కోసం తమ ప్లాన్స్ తమకు ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయో తెలియవన్నారు. అందుకే బీజేపీ, జనసేన, లేదా బీజేపీ, జనసేన, టీడీపీ, జనసేన, టీడీపీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామా అనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేమని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరగడానికి ముందు టీఆర్ఎస్ ను కేసీఆర్ కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కూడా సిద్దమయ్యారన్నారు. కానీ కేసీఆర్ వ్యూహాం మారడానికి కారణం ఏమిటో తెలియదన్నారు. కానీ ఒంటరిగా పోటీ చేసి టీఆర్ఎస్ చాలా రిస్క్ తీసుకొందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పార్టీలో ఒకరిద్దరిలో కోవర్టు ఛాయలు కన్పిస్తున్నాయన్నారు. కొందరు తనను వెనక్కు లాగే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలో ఉంటూ పార్టీని నష్ట పెట్టే వారి కంటే ప్రత్యర్ధులు గెలవడమే బెటర్ అని తాను కోరుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. మీ తప్పులు సరిదిద్దుకోవాలని కూడా పార్టీ నేతలను కోరినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలో ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చని కూడా పవన్ కళ్యాణ్ నిర్మోహామాటంగా ప్రకటించారు. పార్టీలో ఉంటూ ఏ ఒక్క తప్పు చేసినా కకూడా సస్పెండ్ చేస్తామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పాదయాత్రలు చేసిన వారంతా వినోభాభావేలు కాలేరన్నారు. పాదయాత్ర చేసిన వారు ఆంధ్రా థావోస్ గా మారినవాళ్లూ ఉన్నారని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు.
రాయలసీమలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమలో కొందరు నేతల మధ్య పొసగడం లేదన్నారు. కొందరు నేతలు రాయలసీమను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమలో పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడి నేతలకు కప్పం కట్టాలనే డిమాండ్ ఉందన్నారు.
. కప్పం కట్టకపోతే కియా పరిశ్రమపై దాడి చేసినట్టుగా దాడి చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.దేశం నుండి ఎంతో పారిశ్రామిక వేత్తలు హైద్రాబాద్ లో పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పెట్టుబడులు లేకపోతే రాయలసీమ అభివృద్ది జరదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. రాయలసీమ వెనకబడిందని కొందరు నేతలు రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఉపాధి కోసం రాయలసీమ యువత బెంగుళూరు, హైద్రాబాద్ వెళ్తున్నారన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యణ్ చెప్పారు.