రిటైర్డ్ జస్టిస్ గోపాల్ గౌడ వ్యాఖ్యలను అధికారులు సీరియస్‌గా తీసుకోవాలి: పవన్ కళ్యాణ్
ఏపీలో వైసీపీ పాలనపై రిటైర్డ్ గోపాల్ గౌడ చేసిన వ్యాఖ్యలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు.ఈ వ్యాఖ్యలను ఏపీ రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులు సీరియస్ గా తీసుకోవాలన్నారు.
అమరావతి:ఏపీలో వైసీపీ పాలనపై రిటైర్డ్ గోపాల్ గౌడ చేసిన వ్యాఖ్యలను అధికారులు సీరియస్ గా తీసుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్న ప్రతి అధికారిని ప్రజలు గమనిస్తున్నారని పవ్ కళ్యాణ్ తెలిపారు. మీరు ఏ విత్తనం నాటితే అదే పంట వస్తుందనేది కర్మ సిద్దాంతమన్నారు. వైసీపీకి గుడ్డిగా మద్దతిస్తున్న ఉద్యోగి కర్మ సిద్దాంతాన్ని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ పాలనపై రిటైర్డ్ జస్టిస్ గోపాలగౌడ చేసి న వ్యాఖ్యలకు సంబంధించి వీడియోను ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు.
చట్టబద్ద పాలన-భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై అమరావతిలో నిన్న నిర్వహించిన చర్చలో రిటైర్డ్ జస్టిస్ గోపాలగౌడ పాల్గొన్నారు. ఏపీలో పాలనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తీరును రిటైర్డ్ జడ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీసులు ప్రైవేట్ ఆర్మీలా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విపక్ష నేతలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని కూడా ఆయన చెప్పారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలను ఆయన కొన్నింటిని ప్రస్తావించారు. ధేశంలోని రైతుల్లో ఎంతమంది పార్లమెంట్ కు వెళ్లారని రిటైర్డ్ జస్టిస్ గోపాలగౌడ ప్రశ్నించారు.