Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాల్సిందే:పవన్ కళ్యాణ్ డిమాండ్

కర్నూల్ జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కడపకు వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు కర్నూల్ కు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని ఆయన కోరారు.

Jana sena chief Pawan Kalyan demands to change Kurnool district name as Damodaram Sanjeevaiah
Author
Kadapa, First Published Oct 22, 2021, 4:12 PM IST

అమరావతి:కడప జిల్లాకు వైఎస్సార్ అని పేరు పెట్టినప్పుడు  కర్నూలు జిల్లాకు దామోదర సంజీవయ్య పేరు పెట్టాలని  jana sena చీఫ్ Pawan Kalyan డిమాండ్ చేశారు. ఈ విషయమై  వైసీపీ ప్రభుత్వం ముందుకు పట్టించుకోకపోతే అధికార మార్పిడి జరిగిన అనంతరం తామే పేరు మారుస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమకు స్పూర్తి ప్రధాతలని పవన్ కళ్యాణ్ అన్నారు. బూరుగుల రామకృష్ణ స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవిని వదిలేసుకున్నారన్నారు. పీవీ నరసింహారావు ప్రధాని  అయ్యాక ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. 

also read:ఏపీ చరిత్రలో ఇలాంటి దాడుల్లేవ్.. ప్రజాస్వామ్యానికి ముప్పు: పవన్ కళ్యాణ్

దామోదరం సంజీవయ్య  రెండేళ్లే పదవిలో ఉన్నా ఎంతో సేవ చేశారని ఆయన కొనియాడారు. వరదరాజుల ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల కోసం అనేక విధానాలు అమలు చేశారని ఆయన అన్నారు. తెలుగు భాషలోనే ఉత్తర, ప్రత్యుత్తరాలు నడపాలని ఆదేశించారని చెప్పారు. వెనుకబడిన తరగతుల‌వారికి రిజర్వేషన్‌ల కోసం సంజీవయ్య  కృషి చేశారన్నారు.  వృద్దాప్య, దివ్యాంగుల  పెన్షన్ పధకాలకు ఆద్యుడన్నారు. ఇటువంటి మహనీయుడి పేరు నేటి తరాలకు తెలియకుండా చేశారని మండిపడ్డారు. పాలకులు అటువంటి మహనీయుల త్యాగాలను కనీసం  గుర్తు చేసుకోవడం లేదన్నారు.

కోటి రూపాయల నిధులు సేకరించి దామోదరం సంజీవయ్య స్మారక భవనాన్ని నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కర్నూలు జిల్లాలోని పెదపాడులో ఉన్న ఆయన ఇంటిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని  ఆయన చెప్పారు.  చనిపోయే నాటికి బ్యాంకులో రూ.17వేలు, ఒక ఫియేట్ కారు  సంజీవయ్య పేరున  ఉన్నాయన్నారు. మన పాలకులు ఇటువంటి మహానుభావుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.అందుకే తమ బాధ్యతగా కోటి రూపాయల నిధులు‌ సేకరించి అభివృద్ధి చేస్తామని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios