Asianet News TeluguAsianet News Telugu

డేటా ప్రైవసీ: జగన్ కు మూడు ప్రశ్నలు సంధించిన పవన్ కళ్యాణ్


ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్  జగన్ కు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు సంధించారు.  డేటా ప్రైవసీపై పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నలు వేశారు.

Jana Sena Chief Pawan Kalyan Asks  Three questions  To AP CM YS Jagan lns
Author
First Published Jul 23, 2023, 1:54 PM IST

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు సంధించారు.  మీరు సీఎంగా ఉన్నా లేకపోయినా  కూడ  గోప్యత చట్టాలు అలానే ఉంటాయని  పవన్ కళ్యాణ్  చెప్పారు.

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో  వ్యక్తిగత డేటాకు  సంబంధించి  జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన  వీడియోను కూడ   పవన్ కళ్యాణ్  ఈ సందర్భంగా  ట్విట్టర్ లో పోస్టు చేశారు.   సీఎం జగన్ కు  మూడు ప్రశ్నలను సంధించారు. 

also read:వాలంటీర్ల బాస్ ఎవరు?: జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కల్యాణ్

వాలంటీర్లకు  బాస్ ఎవరని  ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు  సంబంధించిన  డేటాను ఎక్కడ భద్రపరుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు  వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత డేటా సేకరించేందుకు  ఎవరు అనుమతించారని  పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

వాలంటీర్లపై  ఈ నెల 9వ తేదీన  పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.  మహిళల అక్రమ రవాణాకు  వాలంటీర్లు దోహదం చేస్తున్నారనే వ్యాఖ్యలను  పవన్ కళ్యాణ్  చేశారు.  ఈ వ్యాఖ్యలు  రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి.  కేంద్ర నిఘా సంస్థలు తనకు ఈ విషయాన్ని చెప్పాయన్నారు.  పవన కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు  ఆందోళనకు దిగారు.  మంత్రులు, వైఎస్ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున  పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. అయితే  పవన్ కళ్యాణ్  వాలంటీర్లపై  చేసిన వ్యాఖ్యలపై  కోర్టులో ఫిర్యాదు చేయాలని మూడు రోజుల క్రితం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు  చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశించింది.

 

వాలంటీర్లు  ప్రజల నుండి వ్యక్తిగత డేటా సేకరణపై  పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్టణంలో వాలంటీర్లు  వ్యక్తిగత డేటా సేకరించడంపై  పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వ్యక్తిగత డేటా సేకరిస్తున్న వాలంటీర్ ను స్థానికులు ప్రశ్నిస్తున్న వీడియోను ట్విట్టర్ లో రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. వాలంటీర్లకు బాస్ ఎవరని ప్రశ్నించారు. ఇవాళ కూడ  సీఎం జగన్ కు మరో మూడు ప్రశ్నలను సంధించారు పవన్ కళ్యాణ్.


 

Follow Us:
Download App:
  • android
  • ios