పోలవరంపై జైట్లీ షాకింగ్ కామెంట్స్

పోలవరంపై జైట్లీ షాకింగ్ కామెంట్స్

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు సమాచారం. ప్రాజెక్టు కోసం చేసిన వ్యయానికి సంబంధించి కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రాజెక్టుపై ఇప్పటి వరకూ రాష్ట్రం రూ. 12500 కోట్లు ఖర్చు చేసినట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే, కేంద్ర జలవరుల శాఖ సహాయమంత్రి పార్లమెంటులో మాట్లాడుతూ, పోలవరంకు ఇప్పటి వరకూ రూ. 6700 కోట్లు ఖర్చయినట్లు చెప్పారు. రెండు అంకెల మధ్య ఎంతటి వ్యత్యాసముందో గమనించారు కదా? ఇదే విధంగా ప్రతీ విషయంలోనూ రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసముంది.

అదే విషయాన్ని జైట్లీ బుధవారం తనను కలసిన నేతల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. పొలవరంపై జైట్లీతో భాజపా ఎంపిలు, మంత్రులు, ఎంఎల్ఏలు సమావేశమయ్యారు. ఆ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ, కేంద్రం వద్ద ఉన్న లెక్కలకూ,  రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన  లెక్కలకు తేడావుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లెక్కలకు మధ్య చాలా వ్యత్యాసం వస్తోందని, ఎలా సాధ్యమని ప్రశ్నించినట్లు సమాచారం. అవకాశం ఉన్నంత వరకు పోలవరాన్ని  త్వరగా పూర్తి చేస్తామని అరుణ్ జైట్లీ సర్దిచెప్పారట.

పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉన్నదని అదే సందర్భంలో ఎటువంటి అవకవతవకలకూ ఆస్కారం ఉండరాదని మాత్రమే కేంద్రం భావిస్తుందని ఆయన స్పష్టం చేసారట. సో జైట్లీ చేసిన వ్యాఖ్యలను బట్టి రాష్ట్ర  ప్రభుత్వం ఇచ్చిన లెక్కలపై కేంద్రం అసంతృప్తిగా ఉన్నట్లుగా ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. మరి, ప్రాజెక్టు పురోగతిలో కేంద్ర ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos