హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని, అంబులెన్స్‌లు ఆపొద్దు: వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

ఏపీ విభజన చట్టం ప్రకారంగా మరో మూడేళ్లపాటు  హైద్రాబాద్ ఉమ్మడి రాజధానే అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే  సామినేని ఉదయభాను గుర్తు చేశారు.

Jaggayyapeta MLA samineni Udayabhanu sensational comments on ambulance obstruction at border lns

జగ్గయ్యపేట:  ఏపీ విభజన చట్టం ప్రకారంగా మరో మూడేళ్లపాటు  హైద్రాబాద్ ఉమ్మడి రాజధానే అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే  సామినేని ఉదయభాను గుర్తు చేశారు.సోమవారం నాడు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోకి  కరోనాతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులను  ప్రవేశించకుండా తెలంగాణ ప్రభుత్వం నిలిపివేస్తున్న ఘటనపై ఆయన స్పందించారు.

 తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపివేయడం అనైతికమన్నారు. తెలంగాణలోకి వైద్య సహాయం కోసం వచ్చే అంబులెన్స్ లను అనుమతించాలని ఆయన కోరారు. మెరుగైన వైద్య సహాయం కోసం దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చన్నారు. రోగుల విషయంలో  తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని ఆయన కోరారు.  ఏపీ నుండి తెలంగాణలోకి అంబులెన్స్ లు ప్రవేశించకుండా నిలిపివేయవద్దని తాము తెలంగాణ పోలీసులను కోరినట్టుగా ఆయన చెప్పారు. 

also read:ఏపీ కరోనా పేషంట్లకు తెలంగాణలో నో ఎంట్రీ.. ! సరిహద్దుల్లో ఆపేస్తున్న పోలీసులు !!

గద్వాల జిల్లాకు సమీపంలోని ఆంధ్రప్రదేఃశ్ సరిహద్దు వద్ద పుల్లూరు చెక్ పోస్టు వద్ద, కోదాడకు సమీంలోని ఆంద్రప్రదేశ్ సరిహద్దు వద్ద ఏపీ నుండి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్పీలతో ఏపీకి చెందిన ఎస్పీలు మాట్లాడి అంబులెన్స్ లను పంపిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios