జగన్ పై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి. కాకినాడ ప్రచారంలో చంద్రబాబు.
చిన్ననాటి నుండి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏదైనా మాట చెబితే.. టీవీలు పగలగొట్టేవాడని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ తీరు భరించలేకనే, ఆయనను బెంగళూరుకు పంపించి వేశాడని ఎద్దేవా చేశారు. కాకినాడ ప్రచారంలో జగన్నాథపురంలో చంద్రబాబు మాట్లాడారు, వైసీపి అధినేత జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.
‘అక్కడ డేరా బాబా...ఇక్కడ జగన్ బాబా’ చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న జగన్ కు జ్వరం వచ్చిందని అన్నారు. అదేవిధంగా కాకినాడ ప్రజలకు అండగా ఉంటామని, వారి అభివృద్దికి కృషి చేస్తామన్నారు. కాకినాడ సిటీని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాకినాడ కన్నెర్ర జేస్తే ప్రతిపాక్షానికి ఒక్క సీటు కూడా రాదని, కాకినాడలోని 48 స్థానాల్లో టీడీపీయే గెలవాలని,టీడీసీ-బీజేపీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేయాలని చంద్రబాబు కోరారు.
మరిన్ని వార్తావిశేషాల కోసం కింద క్లిక్ చేయండి
