జగన్ సీఎం కాలేడు నంద్యాల ఎన్నికలో టీడీపీ గెలుస్తుంది. చంద్రబాబు ఆంద్ర రాష్ట్రాన్ని అభివృద్ది చెయ్యగల కెపాసిటీ ఉన్న నేత అని ఎస్పీవై రెడ్డి
వైసీపి అధ్యక్షుడు సీఎం కావాలనే కల చివరకు అది కలగానే ఉంటుందని ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ పెద్ద యారికల రెడ్డి. జగన్ సీఎం కాలేడని.. కావాలంటే ఇప్పుడే రాసి పెట్టుకోవచ్చు అని ఆయన చెప్పుకోచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతు జగన్ పై ధ్వజమెత్తారు.
జగన్ మాటలకు తప్ప చేతలకు పనికి రాడని ఆరోపించారు ఎస్పీవై రెడ్డి. జగన్ సీఎం పై చేస్తున్న వ్యాఖ్యాలు సరి కావని హితువు పలికారు. ఉప ఎన్నికలో ఎవరు గెలిస్తే వారే 2019లో గెలుస్తారని ఎలా చెప్పగలరని... ‘అది ఎలా సాధ్యం?’ ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికకు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎలా ముడి పెడతారంటు.. ఓ విలేకరి ప్రశ్నకు తిరిగి బదులిచ్చారు. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎస్పీవై రెడ్డి. నంద్యాల ఉప ఎన్నిక ఎంత హోరా హోరిగా జరిగిన తెలుగు దేశం పార్టీదే విజయం అని ఆయన తెలిపారు.
దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానానికి చేర్చే కెపాసిటీ కేవలం చంద్రబాబుకే ఉందని ఎస్పీవై ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్లే భవిషత్త్యులో మరింత పురోగబివృద్ది సాధిస్తుందని ఆయన పెర్కొన్నారు. బాబు కమీట్‌మెంట్ ఉన్న వ్యక్తి అని ప్రజలు ఆయన తరుపున నిలబడాలని సూచించారు.
‘వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన మీరు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా...‘అబద్దాలు చెప్పను.. నన్ను రాజీనామా చేయమని స్పీకర్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు..’ అని ఎస్పీవై రెడ్డి చెప్పుకొచ్చారు.
