తిరుమల: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  సామాన్య భక్తులతో కలిసి  గురువారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకొన్నారు.పాదయాత్రను ముగించుకొని గురువారం నాడు జగన్ తిరుపతికి చేరుకొన్నారు. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు  అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరారు.

సాయంత్రం 4:40 గంటలకు జగన్ తిరుమల కొండపైకి చేరుకొన్నారు. తిరుమల కొండపై ఉన్న ఓ గెస్ట్‌హౌజ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్న తర్వాత సామాన్య భక్తుడి మాధిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్  ద్వారా  శ్రీవారిని దర్శించుకొన్నారు. జగన్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

తండ్రి బాటలోనే తిరుమల కొండపైకి వైఎస్ జగన్