టెక్స్ టైల్స్‌ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా నాలుగున్నర కోట్లు, పరోక్షంగా ఆరు కోట్లమంది చేనేతరంగంలో ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. చేనేత రంగంపై జీఎస్టీ భారం వేస్తే ఆ ప్రభావం వీరిపై పడుతుందన్నారు.

జీఎస్టీ నుండి చేనేతరంగాన్ని మినహాయించాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసారు. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లకీ ఈరోజు లేఖ రాసారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వస్త్రాలకు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) నుంచి మినహాయింపు ఇవ్వాలని తన లేఖలో కోరారు. 

మన దేశంలో వ్యవసాయం రంగం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడ్డారని చెప్పారు. టెక్స్ టైల్స్‌ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా నాలుగున్నర కోట్లు, పరోక్షంగా ఆరు కోట్లమంది చేనేతరంగంలో ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. చేనేత రంగంపై జీఎస్టీ భారం వేస్తే ఆ ప్రభావం వీరిపై పడుతుందన్నారు. జీఎస్టీ వల్ల వస్త్రదుకాణాలు మూసేయాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారుల్లో ఆందోళన నెలకొందన్నారు. కేవలం మూడు, నాలుగు శాతం లాభాలతో అమ్ముకునే వ్యాపారులకు జీఎస్టీ వల్ల అధిక శాతం పన్ను పడుతోందన్నారు.

పెరిగిన రసాయనాలు, నూలు ధరలతో ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న చేనేత రంగం జీఎస్టీ పన్నులతో పూర్తిగా కనుమరుగు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. చేనేతకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తే ఉత్పత్తులు మరింత పెరిగి కార్మికులకు ఊరట కలుగుతుందని తన లేఖలో పేర్కొన్నారు.