తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపడుతున్న సోషల్ మీడియా కార్యకలాపాలను అదుపుచేసేందుకు మొదలుపెట్టిన చర్యల్లో భాగంగా మరొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో అభ్యంతరకర పోస్టింగ్‌లు పెడుతున్నారన్న ఆరోపణలపై ఇప్పాల రవీంద్రరెడ్డి (34) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను విశాఖ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇంతకు ముందు రవికిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా నుంచి స్పందించడం మొదలు పెట్టారు. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పనిచేస్తున్న నెటిజన్లను అరెస్టు చేయడాన్ని వైసిపి అధినేత,ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు.

ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గు చేటు అని పేర్కొన్నారు. ఇలాంటి అరెస్టులని నిలిపేసి, సోషల్ మీడియా యాక్టివిస్టులను హింసించడం మానుకోవాలని అన్నారు,.

Scroll to load tweet…

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపడుతున్న సోషల్ మీడియా కార్యకలాపాలను అదుపుచేసేందుకు మొదలుపెట్టిన చర్యల్లో భాగంగా రెండో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో అభ్యంతరకర పోస్టింగ్‌లు పెడుతున్నారన్న ఆరోపణలపై ఇప్పాల రవీంద్రరెడ్డి (34) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను విశాఖ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

 రవీంద్రరెడ్డి బెంగళూరులోని రామ్మూర్తి నగర్‌లో నివసిస్తూ సౌదీ ఇండస్ట్రియల్‌ సర్వీసెస్‌ సంస్థలో సౌత్‌ ఇండియా, శ్రీలంక ప్రాంతాలకు సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.ఈనెల 11న పాయకరావుపేట తెదేపా ఎమ్మెల్యే వి అనిత ఫిర్యాదు అధారంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

 ఫిర్యాదు ప్రకారం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లైంగిక వేధింపులు, అసభ్యకర మాటలు వాడటంతో పాటు సోషల్ మీడియా అశ్లీల సందేశాలు పోస్టు చేయడం వంటి పనులు చేశాడు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టం కింద కేసులు పెట్టారు. ఒక ప్రత్యేక పోలీసు బృందం బెంగళూరు వెళ్లి రెడ్డి అదుపులోకి తీసుకుంది.

ఇది ఇలా ఉంటే, పేస్ బుక్ లో పొలిటిక్ పంచ్ పేరుతో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను, కొందరిని కించపరిచేవిధంగా ఫోటోలను మార్ఫింగ్ చేశారనే అరోపణల మీద గత నెలలో ఇంటూరి రవికిరణ్ పోలీసులుఅరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జగన్ ట్విట్ట రెక్కి ఈ అరెస్టులను ఖండించారు.

సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయడం చట్టవ్యతిరేకం. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గు చేటు అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.